చేతన్ శర్మ చీఫ్ సెలెక్టర్ పదవికి రాజీనామా చేశారు. ఇటివల స్టింగ్ ఆపరేషన్‌లో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చేతన్.. బోర్డులోని అంతర్గత విషయాలు, ఆటగాళ్ల మధ్య విభేదాలు, బోర్డుకు మాజీ కెప్టెన్లకు మధ్య జరిగిన వివాదాలు, అలాగే ఆటగాళ్లు ఇంజెక్షన్లు తీసుకుంటారంటూ సంచలన విషయాలు వెల్లడించారు.
భారత జాతీయ క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ చేతన శర్మ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను బీసీసీఐ కార్యదర్శి జైషా కూడా ఆమెదించినట్లు సమాచారం. 2020లో సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన చేతన్ శర్మ.. టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా వైఫల్యంతో ఆయనను బీసీసీఐ ఆ పదవి నుంచి తప్పించింది. కొత్త కమిటీని నియమించి మళ్లీ చేతన్ శర్మనే ఆ కమిటీకి చీఫ్‌ని చేసింది బీసీసీఐ. అయితే.. ఇటివల ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ జరిపిన స్టింగ్ ఆపరేషన్‌లో చేతన్ శర్మ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బోర్డులోని అంతర్గత విషయాలు, ఆటగాళ్ల మధ్య విభేదాలు, బోర్డుకు మాజీ కెప్టెన్లకు మధ్య జరిగిన వివాదాలు, అలాగే ఆటగాళ్లు ఇంజెక్షన్లు తీసుకుంటారంటూ సంచలన విషయాలు వెల్లడించారు.
ఆయనపై జరిపిన స్టింగ్ ఆపరేషన్ ఇండియన్ క్రికెట్ వర్గాల్లో పెను దుమారం రేపడంతో ఆయనపై బీసీసీఐ చర్యలు తీసుకోవడం ఖాయంగా మారింది. ఆయన చేసిన వ్యాఖ్యలపై దృష్టిసారించామని బీసీసీఐ ప్రతినిధులు కూడా వెల్లడించారు. బోర్డు నుంచి అలాగే చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి తనను ఎలాగైన తప్పించడం ఖాయమని భావించిన చేతన్ శర్మ.. మర్యాదపూర్వకంగా ఆయననే స్వయంగా చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన రాజీమానా చేస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జైషాకు తెలియజేయగా.. జైషా ఆయన రాజీనామాను ఆమోదించినట్లు తెలుస్తోంది. మరి చేతన్ శర్మ వ్యవహారాన్ని రాజీనామాతో వదిలేస్తారో? లేక విచారణ జరిపి చర్యలు తీసుకుంటారో చూడాలి. అలాగే చేతన్ శర్మ స్థానంలో కొత్త చీఫ్ సెలెక్టర్‌గా ఎవర్ని నియమించనున్నారో కూడా ఆసక్తికర విషయం. మరి చేతన్ శర్మపై స్టింగ్ ఆపరేషన్, ఆయన రాజీనామాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
BCCI chief selector Chetan Sharma resigns from his post. He sent his resignation to BCCI Secretary Jay Shah who accepted it.
(File Pic) pic.twitter.com/1BhoLiIbPc
— ANI (@ANI) February 17, 2023
We Stand With Chetan Sharma pic.twitter.com/Og0SE9QcpZ
— ً (@Ro45Goat) February 14, 2023