కెప్టెన్.. సారథి.. పదమేదైనా బాధ్యత ఒక్కటే. సారథి వేసే వ్యూహ ప్రతివ్యూహాలే జట్టును విజయా తీరాలకు చేరుస్తాయి. ప్రత్యర్థి బలహీనతలను కనిపెట్టి దెబ్బకొట్టడమే కెప్టెన్ బలం. జట్టులోని ఆటగాళ్లనంతా పరిశీలిస్తూ.. ప్రోత్సహిస్తూ.. పరిస్థితులకు తగ్గట్లుగా తయారు చేయాలి. అలా చేయని పక్షంలో జట్టుకు పరాజయాలు తప్పవు. అదీ కాక కెప్టెనే ఘోరంగా విఫలం అవుతూ.. వస్తూంటే ఇక ఆ జట్టేం గెలుస్తుంది. తాజాగా జరుగుతున్న సౌతాఫ్రికా సిరీస్ లో ఆ జట్టు కెప్టెన్ టెంబా బావుమా ప్రస్తుతం ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. వరుసగా విఫలం అవుతూ వస్తూ.. జట్టుకు భారంగా మారాడు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
టెంబా బావుమా.. అతి తక్కువ కాలంలోనే సౌతాఫ్రికా జట్టుకు వన్డే, టీ20 కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. తొలి వన్డే మ్యాచ్ లోనే సెంచరీ చేసిన రెండవ దక్షిణాఫ్రికా బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు. అదీ కాక కెప్టెన్ గా ఉండి సెంచరీ చేసిన తొలి నల్లజాతీయుడిగా ఘనత వహించాడు. ఇలాంటి మంచి రికార్డులే ఉన్నప్పటికీ.. బావుమా అందరిలా ఎక్కువ మ్యాచ్ లు ఆడలేదు.. అలగని అతడు చెప్పుకో దగ్గ బ్యాట్స్ మెనూ కాదు. మరి అతడికి కెప్టెన్సీ ఎందుకు ఇచ్చారో ఇప్పటికీ ప్రశ్నార్థకమే. భారత్ జరిగిన రెండు టీ 20ల్లో దారుణంగా విఫలం అయ్యాడు. తొలి టీ20లో 4 బంతులు ఆడిన బావుమా డకౌట్ గా వెనుదిరిగాడు. ఇక తాజా మ్యాచ్ లో 7 బాల్స్ ఎదుర్కొని మరో డకౌట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ముందుండి జట్టును నడపాల్సిన సారథే చేతులెత్తేస్తే.. ఇక జట్టు మాత్రం ఏం చేస్తుంది. బావుమా గత 5 టీ20 మ్యాచ్ ల్లో 15.25 సగటుతో కేవలం 61 రన్స్ మాత్రమే చేశాడు. ఈ గణాంకాలే చెబుతున్నాయి.. అతడు జట్టుకు ఎంత భారంగా మారాడో! ఈ సిరీస్ ఓటమితో అతడిపై మాజీలు విమర్శలు గుప్పిస్తున్నారు.
తాజాగా దక్షిణాఫ్రికా మాజీ బౌలర్ మకాయా ఎన్తిని బావుమా పై స్పందిస్తూ..” మార్క్ బౌచర్ ఒకసారి ఆటగాళ్ల ఆటను పరిశీలించు.. ముఖ్యంగా టీమ్ కెప్టెన్ ఫామ్ ఆందోళనకు గురిచేస్తోంది. గత కొన్ని మ్యాచ్ ల నుంచి అతడి ఫామ్ ను మీరు గమనించండి. అతడు రోజు రోజుకు దిగజారిపోతున్నాడు. సారథి పరుగులు సాధించకుండా జట్టులో కొనసాగుతుంటే అతడు జట్టుకు భారమే” ఈ వ్యాఖ్యలు చూస్తేనే తెలుస్తోంది.. అయితే వరల్డ్ నెంబర్ 2 బౌలర్ అయిన తబ్రాజ్ షమ్సీని ఎందుకు బావుమా ఆడించట్లేదు? అదీ గాక వరుసగా గతంలో 4 అర్ద శతకాలు చేసిన హెన్రిక్స్ ను ఎందుకు జట్టులోకి తీసుకోలేదు. జట్టు కూర్పును బావుమా అందుకోలేక పోతున్నాడా? అంటే అవుననే అంటున్నారు క్రీడానిపుణులు. ఇప్పటికైన తన తప్పులు సరిదిద్దుకుని ఫామ్ లోకి రాకపోతే అటు బావుమాకు, జట్టుకు రాబోయే రోజుల్లో గడ్డు పరిస్థితులు తప్పవని క్రీడానిపుణులు హెచ్చరిస్తున్నారు.
Captain Temba Bavuma will try to comeback stronger in the third T20I v India on Tuesday.#INDvSA pic.twitter.com/JKoi9b6g6o
— CricTracker (@Cricketracker) October 2, 2022
A run-fest in Guwahati.#CricTracker #INDvSA #RohitSharma #ViratKohli pic.twitter.com/JYSazpMCQX
— CricTracker (@Cricketracker) October 2, 2022