సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పీడస్టర్ ‘ఉమ్రాన్ మాలిక్‘ ఐపీఎల్-2022లో అద్భుతంగా రాణించాడు. స్థిరంగా గంటకు 150 కిమీ వేగంతో బంతులు సంధిస్తూ.. ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. సన్‌రైజర్స్ ఆడిన అన్ని మ్యాచుల్లోనూ ఫాస్టెస్ట్ డెలివరీ ఉమ్రాన్ మాలిక్‌దే అంటే.. అతడి వేగం ఎంతుంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసిన ఉమ్రాన్.. ఏకంగా భారత జట్టలో చోటు దక్కించుకున్నాడు. స్వదేశంలో జూన్ 9 నుంచి దక్షిణాఫ్రికాతో జరగనున్న టీ20 సిరీస్‌కు ఉమ్రాన్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ సిరీస్ లో ఉమ్రాన్ తన సత్తా ఏంటో నిరూపించుకోనున్నాడు. ఈ క్రమంలో ఉమ్రాన్ మాలిక్ పై.. ఆసీస్ పేస్ దిగ్గజం బ్రెట్ లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడిని చూడగానే తనకు పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ వకార్ యూనిస్ గుర్తుకొచ్చాడని అన్నాడు.
”ఐపీఎల్ లో అతడు సంధిచే వేగాన్ని చూసి.. నేనూ మీలాగే ఉమ్రాన్ కు అభిమానిగా మారిపోయా. అతడిలో చాలా సత్తా దాగి ఉంది. క్రికెట్ లో పాత తరపు ఫాస్ట్ బౌలర్లు పరిగెత్తినంత వేగంగా పరిగెడుతున్నాడు. అతని బౌలింగ్‌లో ఉండే వేగం ప్రత్యర్థి బ్యాటర్లను తగలెట్టేస్తుంది. ఫాస్ట్ బౌలర్లకు ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉమ్రాన్‌లో స్పష్టంగా ఉన్నాయి. కచ్చితమైన వేగం.. బులెట్ వేగంతో వచ్చే బంతులు.. ఇవన్నీ కలిపి ఉమ్రాన్ గురించి ఆలోచిస్తుంటే నాకు పాక్ దిగ్గజ బౌలర్ వకార్ యూనిస్ గుర్తుకు వస్తున్నాడు”.
Brett Lee heaps praise on Umran Malik for his brilliant bowling in Indian T2o League 2022.
(📸 : BCCI)#BrettLee #UmranMalik #Hyderabad #India #IndianT20League2022 #Cricket #SKY247 #Socialmedia pic.twitter.com/89yorKTEPS
— Sky247 (@officialsky247) May 31, 2022
“వకార్ యూనిస్ కూడా ఫాస్ట్ బౌలింగ్‌కు పెట్టింది పేరు. గంటకు 150 కిమీవేగంతో బంతులు సందిస్తూ వికెట్లు తీసేవాడు. అయితే రనప్ విషయంలో ఉమ్రాన్ తనను తాను మెరుగుదిద్దుకోవాలి. మణికట్టు ద్వారా బౌలింగ్ చేసే సరళి, రన్నింగ్ యాక్షన్, బంతి విసిరేప్పుడు చేయి ఏ విధంగా ఉండాలనే దానిమీద అతడు మరింత నేర్చుకోవాల్సింది ఉంది. కానీ, అసలు విషయం ఏమిటంటే ఒక బౌలర్ బౌలింగ్ యాక్షన్ ఎప్పటికీ పర్ఫెక్ట్ గా ఉండదు. వేరేవాళ్లదాకా ఎందుకు..? నా బౌలింగ్ యాక్షన్ లో కూడా లోపాలున్నాయి. కానీ నేను నా కెరీర్ లో చివరి బంతి వేసే వరకు అత్యుత్తమ బంతులే వేయడానికి ఎంతో ప్రయత్నించాను. ఆ రోజుల్లో నిత్యం నా బౌలింగ్ యాక్షన్ మీద ఎక్కువ దృష్టి సారించేవాన్ని. అలా ప్రతిరోజు నా నైపుణ్యాన్ని మెరుగు దిద్దుకునేవాడిని..’ బ్రెట్ లీ అని చెప్పుకొచ్చాడు.
Umran Malik wins the Emerging Player award at #IPL2022
Can the young pacer make it big at the international level? pic.twitter.com/kHqvRQFgHi
— ESPNcricinfo (@ESPNcricinfo) May 31, 2022
ఇది కూడా చదవండి: Mohammed Siraj: నిన్నటి వరకు కోహ్లీ అనుచరుడు. ఒక్కసారిగా కోహ్లీని కాదని..!
కాగా.. ఈ సీజన్‌లో ఉమ్రాన్ మాలిక్.. తన ప్రదర్శనకు గానూ ”ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్” అవార్డును కైవసం చేసుకున్నాడు. మొత్తంగా 14 మ్యాచులాడిన ఉమ్రాన్ 22 వికెట్లు పడగొట్టాడు. మరి.. ఉమ్రాన్ మాలిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.