ఆసియా కప్ నుంచి టీమిండియాను వేధిస్తోన్న ప్రధాన సమస్య బౌలింగ్. లీగ్ మ్యాచ్ ల్లో బాగానే రాణిస్తున్నప్పటికీ నాకౌట్ మ్యాచ్ లకు వచ్చే సరికి బౌలింగ్ లో తేలిపోతున్నారు టీమిండియా బౌలర్లు. ప్రధాన బౌలర్ అయిన జస్ప్రీత్ బూమ్రా గాయం కారణంగా టీ20 వరల్డ్ కప్ కు దూరం కావడంతో.. టీమిండియా భారీ మూల్యం చెల్లించుకుంది. ఈ మెగా టోర్నీలో సెమీస్ లోనే ఇంటిదారి పట్టింది భారత జట్టు. అయితే టీమిండియా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య డెత్ ఓవర్లలో స్పెషలిస్టు బౌలర్ లేకపోవడమే. ఇప్పటి వరకు డెత్ ఓవర్ల స్పెషలిస్టుగా ఉన్న బూమ్రా గాయపడటం, సీనియర్ బౌలర్ అయిన భువనేశ్వర్ పెద్దగా ప్రభావం చూపించకపోవడం లాంటి అంశాలు టీమిండియాను తెగ ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత జట్టుకు ఓ ఆణిముత్యం లాంటి బౌలర్ దొరికాడు. అతడే నయా స్వింగ్ కింగ్ అర్షదీప్. ఈ యువ సంచలనానికి ఫ్యాన్ గా మారిపోయాడు ఆసిస్ స్టార్ బ్రెట్ లీ. ఈ క్రమంలోనే అతడికి కొన్ని విలువైన సలహాలు, సూచనలు ఇచ్చాడు.
అర్షదీప్ సింగ్.. ప్రస్తుతం టీమిండియా బౌలింగ్ దళానికి వెన్నముకగా నిలుస్తున్నాడు. సీనియర్ బౌలర్ భువనేశ్వర్ సలహాలతో అద్భుతంగా రాణిస్తున్నాడు. మెున్నటి టీ20 వరల్డ్ కప్ లో సైతం అద్భుత ప్రదర్శన కనబర్చి 10 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే అర్షదీప్ బౌలింగ్ ఫిదా అయ్యాడు ఆసిస్ మాజీ క్రికెటర్ బ్రెట్ లీ. టీమిండియాలో లెఫ్ట్ఆర్మ్ పేసర్లలో నాకు నచ్చిన బౌలర్ అర్షదీప్ అంటూ కితాబిచ్చాడు. అదీకాక అతడికి బౌలింగ్ లో కొన్ని సలహాలు కూడా ఇచ్చాడు. అర్షదీప్ ను ముఖ్యంగా జిమ్ కు వెళ్లోద్దని సూచించాడు ఆసిస్ స్పీడ్ స్టర్.
ఒకవేళ వెళ్లినాగానీ ఎక్కువగా బరువులు ఎత్తొద్దని సలహా ఇచ్చాడు. జిమ్ లో కసరత్తులు చేసి కండలు పెంచితే బౌలింగ్ వేగం పెరగదని, దాంతోపాటు ఎక్కువ కాలం కెరీర్ కొనసాగదని బ్రెట్ లీ ఈ సందర్బంగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నువ్వు అద్భుతమైన ఫామ్ లో ఉన్నావని దానిని అలాగే కొనసాగించాలని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక అర్షదీప్ జిమ్ కు వెళ్తే టీమిండియాకు భారీ నష్టం కలుగుతుందని హెచ్చరించాడు. సాధ్యమైనంత ఎక్కువగా సోషల్ మీడియాకు దూరంగా ఉండాలంటూ బ్రెట్ లీ అర్షదీప్ కు సలహా ఇచ్చాడు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను పట్టించుకోకూడు అంటూ.. గతంలో అర్షదీప్ సింగ్ పై వచ్చిన ట్రోల్స్ ను గుర్తుచేస్తూ చెప్పుకొచ్చాడు.
🗣️ Brett Lee: Arshdeep Singh is my new favorite left-arm fast bowler from India #TeamIndia #ArshdeepSingh #NZvIND pic.twitter.com/uLSITz4w35
— CricFit (@CricFit) November 28, 2022