లార్డ్స్ టెస్టులో భారీ ఓటమి ఖాయముననుకున్న ఇంగ్లాండ్ స్టోక్స్ పోరాటం కారణంగా 43 పరుగుల తేడాతో ఓడిపోయింది. స్టోక్స్ మరి కాసేపు క్రీజ్ లో ఉంది ఉన్నా లేకపోతే బెయిర్ స్టో రనౌట్ కాకపోయినా ఇంగ్లాండ్ విజయం సాధించేది. ఇక మ్యాచ్ అనంతరం స్టోక్స్ మాట్లాడుతూ బెయిర్ స్టో రనౌట్ పై సంచలన కామెంట్స్ చేసాడు.
యాషెస్ లో భాగంగా లార్డ్స్ లో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఐదవ రోజు ఆసీస్ మ్యాచ్ ని ఏకపక్షంగా ముగుస్తుందని భావించిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అసాధారణ పోరాటం కారణంగా చివరి వరకు మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఓవర్ నైట్ స్కోర్ 114/4 తో ఆట కొనసాగించిన ఇంగ్లీష్ టీంకి ప్రారంభంలో స్టోక్స్, డకెట్ మంచి ఆరంభమే ఇచ్చారు. అయితే జట్టు స్కోర్ 177 పరుగుల వద్ద హాజెల్ వుడ్ బౌలింగ్ లో డకెట్ ఔటయ్యాడు. ఇక ఈ దశలో క్రీజ్ లోకి వచ్చిన బెయిర్ స్టో ఉహించని రీతిలో రనౌట్ కావడం ఇంగ్లాండ్ విజయావకాశాలను దెబ్బ తీసింది. స్టోక్స్ చివరి వరకు పోరాడినా బెయిర్ స్టో కూడా ఉండి ఉంటే ఇంగ్లాండ్ సింపుల్ గా విజయాన్ని సొంతం చేసుకునేది. కెప్టెన్ స్టోక్స్ టైలండర్స్ తో పోరాడిన ప్రయోజనం లేకుండా పోయింది. ఇక మ్యాచ్ అనంతరం స్టోక్స్ మాట్లాడుతూ బెయిర్ స్టో రనౌట్ పై సంచలన కామెంట్స్ చేసాడు.
లార్డ్స్ టెస్టులో భారీ ఓటమి ఖాయముననుకున్న ఇంగ్లాండ్ స్టోక్స్ పోరాటం కారణంగా 43 పరుగుల తేడాతో ఓడిపోయింది. స్టోక్స్ మరి కాసేపు క్రీజ్ లో ఉంది ఉన్నా లేకపోతే బెయిర్ స్టో రనౌట్ కాకపోయినా ఇంగ్లాండ్ విజయం సాధించేది. ఓవర్ అయిపోయిందని జానీ బెయిర్‌స్టో, అంపైర్ వైపు చూడకుండా ముందుకు నడిచాడు. దీన్ని గమనించిన అలెక్స్ క్యారీ, వికెట్లవైపుగా త్రో విసిరాగా అది స్టంప్స్ కి తగిలింది. దీంతో క్యారీతో పాటుగా ఆస్ట్రేలియా ఫీల్డర్లు అప్పీలు చేయడం, థర్డ్ అంపైర్ స్టంపౌట్‌గా ప్రకటించాడు. అయితే ఈ విషయంలో స్టోక్స్ మాత్రం తన అసహనాన్ని వ్యక్తం చేసాడు. మేము ఇలాంటి పరిస్థితిలో ఉంటే అప్పీల్ ని వెనక్కి తీసుకునే వాళ్ళం అని తెలిపాడు.
స్టోక్స్ మాట్లాడుతూ ” బెయిర్ స్టోకి సింగిల్ తీసే ఉద్దేశ్యం లేదు. ఓవర్ అయిపోయిందని భావించి నాతో మాట్లాడడానికి వచ్చాడు. ఈ విషయం ఆస్ట్రేలియాకి కూడా తెలుసు. అయినా వికెట్ కోసం అప్పీలు చేయడం షాకింగ్ గా అనిపించింది. ‘బెయిర్ స్టో వికెట్ విషయంలో అంపైర్లు ఏ నిర్ణయం తీసుకుంటారోనని ఎదురుచూశాను. మేం ఆ పొజిషన్‌లో ఉంటే అప్పీల్ వెనక్కి తీసుకునేవాళ్లం. ఇలా గెలవాలని మాత్రం అనుకోం. ఇక సిరీస్ గురించి మాట్లాడుతూ తొలి రెండు టెస్టులు ఓడిపోయిన మాకు సిరీస్ గెలిచే అవకాశం ఇంకా ఉంది. అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి బెయిర్ స్టో రనౌట్ పై స్టోక్స్ స్పందించిన విధానం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.