భారతదేశంలో క్రికెట్ కు ఉన్నంత క్రేజ్ మరే ఆటకు లేదనడంలో.. ఎలాంటి సందేహం లేదు. దాంతో తమ అభిమాన క్రికెటర్లకు సంబంధించిన చాలా విషయాలను తెలుసుకోవాలని ఆరాటం సగటు క్రికెట్ అభిమానికి ఉంటుంది. అందులో భాగంగానే ముఖ్యంగా క్రికెటర్లు ఒక్క మ్యాచ్ కు ఎంత మెుత్తం జీతంగా తీసుకుంటరో అన్న ప్రశ్న చాలా మంది మనసులో మెదులుతూ ఉంటుంది. దాంతో ఇంటర్ నెట్ లో తెగ సెర్చ్ చేస్తుంటారు క్రికెట్ అభిమానులు. అయితే ఈ క్రమంలోనే BCCI.. ఆటగాళ్ల జీతాలకు సంబంధించిన ఓ కీలక ప్రకటనను విడుదల చేసింది. దీనికి సంబంధించిన కీలక విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా తన ట్వీటర్ ద్వారా షేర్ చేశాడు. ఇక నుంచి టీమిండియా పురుష క్రికెటర్లకు, మహిళా క్రికెటర్లకు ఓకే జీతం వర్తించనుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
పురుషుల క్రికెట్ పై పెట్టిన శ్రద్ద.. మహిళల క్రికెట్ పై పెట్టడంలేదన్న అపవాదు BCCI పై ఉంది. మహిళా క్రికెటర్లు అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ వారికి మాత్రం.. పురుష క్రికెటర్లకు వచ్చినంత పేరు మాత్రం రావట్లేదు. అదీ కాక ఇంతకు ముందు మెన్స్ కు వుమెన్స్ కు వేరు వేరు రకాలుగా మ్యాచ్ జీతాలు ఉండేవి. కానీ ప్రస్తుతం ఆ జీతాలను సవరించి అందరి క్రికెటర్లకు ఓకే రకమైన జీతాలను ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ ఓ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి నుంచి ఒక టెస్టు మ్యాచ్ కు మహిళా క్రికెటర్లకు, పురుష క్రికెటర్లకు రూ.15 లక్షలు ఇస్తారు. అలాగే వన్డేలకు 6 లక్షలు, అంతర్జాతీయ టీ20లకు ఒక్కో మ్యాచ్ కు 3 లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు దానికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది.
The @BCCIWomen cricketers will be paid the same match fee as their male counterparts. Test (INR 15 lakhs), ODI (INR 6 lakhs), T20I (INR 3 lakhs). Pay equity was my commitment to our women cricketers and I thank the Apex Council for their support. Jai Hind 🇮🇳
— Jay Shah (@JayShah) October 27, 2022
ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా ట్వీటర్లో ఈ విధంగా రాసుకొచ్చాడు. “బీసీసీఐ తీసుకున్న అత్యుత్త నిర్ణయాల్లో ఇది ఒకటి. లింగ సమానత్వాన్ని మేం ఎప్పుడూ ప్రోత్సహిస్తాం. అందులో భాగంగానే పురుష క్రికెటర్లకు, మహిళా క్రికెటర్లకు సమాన వేతనాలు ఇవ్వదలిచాము. ఇది ఈ దశాబ్దంలో క్రికెట్ లోకంలో అతిగొప్ప నిర్ణయంగా మేం భావిస్తున్నాం. దీనికి తమ మద్ధతు ప్రకటించిన అపెక్స్ కౌన్సిల్ కు మా ధన్యవాదాలు” అంటూ రాసుకొచ్చాడు. తాజాగా బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. దేశంలో అన్ని క్రీడలను ఇలాగే చూడాలని నెటిజన్లు కోరుతున్నారు. ఇక బీసీసీఐ నిర్ణయంపై మహిళా క్రికెటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
The match fees for India Men & Women cricketers:
Tests: 15 Lakhs
ODI: 6 Lakhs
T20I: 3 Lakhs— Johns. (@CricCrazyJohns) October 27, 2022