ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో బోణీ కొట్టింది బంగ్లా జట్టు. జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో జరిగిన తొలి టీ20లో బంగ్లా అన్ని విభాగాల్లో అదరగొట్టి.. ఛాంపియన్స్ జట్టుకు షాకిచ్చింది.
మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ ఆడేందుకు వరల్డ్ ఛాంపియన్ జట్టు అయిన ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మూడు వన్డేల సిరీస్ ను చమటోడ్చి నెగ్గింది ఛాంపియన్ జట్టు. వన్డే సిరీస్ ను 2-1తో కైవసం చేసుకున్న ఇంగ్లాండ్ జట్టు.. తొలి టీ20లో ఆతిథ్య బంగ్లాదేశ్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవి చూసింది. తొలి టీ20లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో బంగ్లా జట్టు అదరగొట్టింది.
ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో బోణీ కొట్టింది బంగ్లా జట్టు. జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో జరిగిన తొలి టీ20లో బంగ్లా అన్ని విభాగాల్లో అదరగొట్టి.. ఛాంపియన్స్ జట్టుకు షాకిచ్చింది. తొలుత టాస్ గెచిలి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లా జట్టు.. కట్టుదిట్టంగా బంతులేయడంతో తక్కువ స్కోరుకే పరిమితం అయ్యింది ఇంగ్లాండ్ జట్టు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులకే పరిమితం అయ్యింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఓపెనర్లు అద్భుత ఆరంభాన్ని ఇచ్చినప్పటికీ టాపార్డర్ బ్యాటర్లు దాన్ని వినియోగించుకోలేక పోయారు.
ఈ క్రమంలోనే తొలి వికెట్ కు 9 ఓవర్లలో 80 పరుగులు జోడించారు ఇంగ్లాండ్ ఓపెనర్లు. ఆ తర్వాత ఏ ఇంగ్లాండ్ బ్యాటర్ కనీసం 10 పరుగులు కూడా చేయలేదు. జట్టులో సాల్ట్(38), కెప్టెన్ బట్లర్(67), డకెట్(20) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. బంగ్లా బౌలర్లలో హసన్ మహ్మద్ 2 వికెట్లు తీశాడు. అనంతరం కష్టసాధ్యం కాని లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా జట్టు.. మెుదటి నుంచి విజయం వైపుగానే సాగింది. ఎక్కడా తడబడకుండా నిదానంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఈ క్రమంలోనే 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని పూర్తి చేసింది.
ఇక బంగ్లాదేశ్ జట్టులో షాంటో 30 బంతుల్లో 8 ఫోర్లతో 51 పరుగులతో బంగ్లా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడికి అండగా.. షకీబ్ అల్ హసన్ (34), హ్రిడాయ్(24), తాలుక్దార్(21) పరుగులతో రాణించారు. ఏ మాత్రం ప్రభావం చూపని ఇంగ్లాండ్ బౌలర్లు.. ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ మ్యాచ్ లో ఏడుగురు ఇంగ్లాండ్ బౌలర్లు బౌలింగ్ చేయడం విశేషం. ఇక మూడో వన్డేలోనూ, తొలి టీ20లోనూ ఇంగ్లాండ్ ను ఓడించిన బంగ్లాదేశ్ జట్టుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
History: Bangladesh has beaten World Champions England in T20I.
A great day in Bangladesh cricket. pic.twitter.com/OpHuofD2ef
— Johns. (@CricCrazyJohns) March 9, 2023