న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ 2022లో బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. హామిల్టన్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో 9 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో వన్డేల్లో పాకిస్తాన్‌పై తొలి విజయం సాధించి బంగ్లాదేశ్ హిస్టరీ క్రియేట్ చేసింది. తొలి మ్యాచ్‌లోనే బలమైన పాకిస్థాన్ జట్టును ఓడించడంతో బంగ్లా ప్లేయర్ల ఆనందానికి అడ్డులేకుండా పోయింది. వికెట్లు పడిన సమయంలో డాన్స్‌లతో రచ్చరచ్చ చేశారు.
బంగ్లాదేశ్ పురుషుల జట్టు కూడా గ్రౌండ్లో నాగిని డాన్స్‌లతో చేసిన రచ్చ క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోరు. ఇప్పుడు మహిళల జట్టు కూడా ఇలాగే ఉత్సహం ఆపుకోలేక మైదానంలో చేసిన సెలబ్రేషన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్రికెట్లో సంబరాలు చేసుకోవాలంటే బంగ్లాదేశ్ ప్లేయర్స్ తర్వాతే ఎవరైనా అంటూ నెటిజన్లు వీడియో తెగ షేర్ చేస్తున్నారు. అందులోనూ అమ్మాయిలు ఇలా ఫుల్ జోష్‌లో తన గెలుపును ఎంజాయ్ చేయడంతో మరింత వైరల్‌గా మారింది వీడియో. మరి ఈ సెలబ్రేషన్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: తన క్రష్ ఎవరో చెప్పేసిన బ్యూటిఫుల్ క్రికెటర్ స్మృతి మంధాన
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.