కూర్చోని అలా బాల్‌ను టైమ్ చేశాడు అంతే.. ఆకాశంలోకి రాకెట్‌లా దూసుకెళ్లింది బాల్. స్టేడియం రూఫ్ పై నుంచి గ్రౌండ్ బయట రోడ్డుపై పడింది. ఈ షాట్ ఆడింది ఎవరో తెలస్తే షాక్ అవుతారు.
మనిషి చూసేందుకు భారీ కాయంతో కచ్చితంగా ఈ తరం క్రికెటర్ కాదులే అనేలా ఉంటాడు. కానీ.. మొకాళ్లపై కూర్చోని కొడితే బంతి స్టేడియం బయటపడుతుంది. అలాంటి ఆటగాడే పాకిస్థాన్ క్రికెటర్, బిగ్ మ్యాన్ అజమ్ ఖాన్. ప్రస్తుతం పాకిస్థాన్ జాతీయ జట్టులో లేని అజమ్ ఖాన్.. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో తన సత్తా చాటుతున్నాడు. తాజాగా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన అజమ్.. ఇప్పుడు పీఎస్‌ఎల్‌లో తన పవర్ హిట్టింగ్‌తో దడపుట్టిస్తున్నాడు.
కరాచీ వేదికగా శుక్రవారం క్వాట్టా గ్లాడియేటర్స్-ఇస్లామాబాద్ యూనైటెడ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అజమ్ ఖాన్ విధ్వంసం సృష్టించాడు. ఇస్లామాబాద్ తరఫున ఆడుతున్న అజమ్.. క్వాట్టా బౌలర్లును పిచ్చికొట్టుడు కొట్టాడు. బౌలర్ ఎవరైనా లెక్కచేయకుండా ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడ్డాడు. కేవలం 42 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సులతో 97 పరుగులు చేసి.. తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. ఇన్నింగ్స్ చివరి బాల్‌కు అవుట్ అవ్వడంతో అద్భుత సెంచరీ చేజార్చుకున్నాడు.
అయితే.. ఈ సునామీ ఇన్నింగ్స్‌లో అజమ్ ఖాన్ ఆడిన ఒక షాట్ మాత్రం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అజమ్ ఖాన్ ఆడిన షాట్ వీడియో వైరల్‌గా మారింది. భారీ కాయంతో ఉండే అజమ్ ఖాన్ మొకాళ్లపై కూర్చోని ఏకంగా 102 మీటర్ల సిక్స్ కొట్టాడు. ఆకాశంలోకి రాకెట్‌లా దూసుకెళ్లిన బంతి.. స్టేడియం రూఫ్‌పై ఒక స్టెప్ పడి స్టేడియం బయటికి వెళ్లి పడింది. దీంతో.. స్టేడియంలోని ప్రేక్షకులే కాక, రెండు జట్ల ఆటగాళ్లతో పాటు క్వాట్టా గ్లాడియేటర్స్‌కు హెడ్ కోచ్‌గా ఉన్న అజమ్ ఖాన్ తండ్రి, మాజీ క్రికెటర్ మొయిన్ ఖాన్ సైతం అలాగే చూస్తూ ఉండిపోయాడు. అజమ్ సునామీతో ఇస్లామాబాద్ 20 ఓవర్లలో 220 పరుగుల భారీ స్కోర్ చేసి, 63 పరుగుల తేడాతో ఈ మ్యాచ్ గెలిచింది. మరి కిందున్న వీడియో చూసి అజమ్ ఖాన్ భారీ సిక్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Short of the Tournament 🥶
AZAM KHAN ♥️#QGvIU pic.twitter.com/M9X4cTmc9D— Akhtar Jamal (@AkhtarActivist) February 24, 2023