ఇప్పుడిప్పుడే టీమిండియాలో సుస్థిర స్థానం సంపాదించుకుంటున్న అక్షర్ పటేల్.. గత కొంత కాలంగా బౌలింగ్ లో విఫలమవుతూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ మీద వికెట్ తీసుకున్న అక్షర్.. ఆ తర్వాత వికెట్ తీయడానికి ఏకంగా 47.4 ఓవర్లు బౌలింగ్ చేయడం గమనార్హం.
టీం ఇండియా ఆఫ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ ఒక బౌలర్ గా జట్టులోకి అడుగుపెట్టాడు. తన అరంగ్రేట మ్యాచ్ మొదలుకొని ప్రతి మ్యాచ్ లో వికెట్లు తీస్తూ అంచనాలకు మించి రాణించాడు. ఒక దశలో ఈ ఆఫ్ స్పిన్నర్ ప్రధాన స్పిన్నర్లయినా అశ్విన్, జడేజా కంటే మెరుగ్గా బౌలింగ్ చేయడం విశేషం. ముఖ్యంగా తన తొలి 15 ఇన్నింగ్స్ ల్లోనే 5 సార్లు 5 వికెట్లు తీసుకున్న ఘనత అక్షర్ సొంతం. అంతే కాదు భారత్ తరపున వేగంగా 50 వికెట్లు తీసుకున్న బౌలర్ గా రికార్డ్ సృష్టిద్దామనుకున్న అక్షర్ కి నిరాశ ఎదురైంది. ఏమైందో తెలియదు కానీ అక్షర్ పటేల్ కి ఈ మధ్య ఒక్క వికెట్ కూడా దక్కడం లేదు.
టీం ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చినప్పటినుండి అక్షర్ పటేల్ చాలా వేగంగా వికెట్లు తీసాడు. కానీ ఇప్పుడు కనీసం ఒక్క వికెట్ తీయడానికి చాలా కష్టపడుతున్నాడు. ముఖ్యంగా బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో అక్షర్ పటేల్ ఒక్క వికెట్ తీసుకోవడానికి నాలుగు టెస్టులు అవసరమయ్యాయి. ఇప్పటివరకు ఈ సిరీస్ లో తొలి మూడు టెస్టుల్లో ఈ ఆఫ్ స్పిన్నర్ కి ఒక్క వికెట్ కూడా దక్కలేదు. స్పిన్ కి అనుకూలించే భారత్ పిచ్ లపై కూడా అక్షర్ వికెట్ తీయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ ఎట్టలకే చివరిదైన నాలుగవ టెస్టులో ఖవాజాని ఎల్బీడబ్ల్యూ చేయడంతో అక్షర్ కి ఈ సిరీస్ లో తొలి వికెట్ లభించింది. చివరిగా బంగ్లాదేశ్ మీద వికెట్ తీసుకున్న అక్షర్.. ఆ తర్వాత వికెట్ తీయడానికి ఏకంగా 47.4 ఓవర్లు బౌలింగ్ చేయడం గమనార్హం. అయితే ప్రస్తుత సిరీస్ లో బౌలింగ్ లో విఫలమైనా బ్యాటింగ్ లో మాత్రం అదరగొడుతున్నాడు. ఇప్పటికే ఈ సిరీస్ లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన వారిలో మొదటి స్థానంలో ఉన్నాడు. మొత్తానికి ఒక బౌలర్ గా ఆకట్టుకుంటాడనుకున్న అక్షర్.. బ్యాటింగ్ లో సత్తా చూపిస్తున్నాడు.
Axar Patel gets the BIG WICKET! 🙌
Usman Khawaja goes for 180(422) 👏#IndvsAus #BGT2023 #UsmanKhawaja #Cricket pic.twitter.com/7j2PfVKFxf— OneCricket (@OneCricketApp) March 10, 2023