అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న డబ్ల్యూటీసీ ఫైనల్ కి ఒక్క రోజు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో దిగ్గజాలు ఏ జట్టు గెలుస్తుందో ఒక అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా.. పాకిస్థాన్ దిగ్గజ బౌలర్ మాత్రం భారత్ కి ఈ ఫైనల్ గెలిచేంత సీన్ లేదంటున్నాడు.
అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ రానే వచ్చింది. మ్యాచ్ చూడడానికి మరో రోజు మాత్రమే మిగిలి ఉంది. లండన్ లోని ఓవల్ మైదానం ఈ మ్యాచ్ కి ఆతిధ్యమివ్వనుంది. భారత్ కాలమాన ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 నిమిషాలకి జరుగనుంది. స్టార్ స్పోర్ట్స్, డీడీ స్పోర్ట్స్ లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో దిగ్గజాలు గెలిచే జట్టుని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ మ్యాచ్ లో భారత్ కి గెలిచే సీన్ లేదని సూటిగానే చెప్పేసాడు. ప్రస్తుతం అక్రమ్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
భారత్ తో పోల్చుకుంటే ఇంగ్లాండ్ పిచ్ ల మీద ఆస్ట్రేలియాకి మంచి అనుభవంతో పాటు.. పూర్తి అవగాహన కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ఈ ఫైనల్లో ఫేవరేట్ గా దిగబోతుంది. పలువురు క్రికెట్ పండితులు కూడా ఆస్ట్రేలియానే ఈ టైటిల్ గెలుస్తుందని చెప్పుకొచ్చారు. అయితే పాకిస్థాన్ మాజీ బౌలర్ వసీం అక్రమ్ మాత్రం భారత్ ని బాగా తక్కువ అంచనా వేస్తున్నాడు. ఎంత బౌన్సీ పిచ్ లైనా భారత్ గత రెండేళ్లలో అన్ని దేశాల్లో విజయాలు సాధిస్తుంది. ఆస్ట్రేలియా గడ్డ మీద వారినే వరుసాగా రెండు సార్లు ఓడించి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఎగరేసుకుపోయిందనే సంగతి గుర్తుంచుకోవాలి. ఈ విషయాలు తెలియకుండా అక్రమ్ భారత్ ని తక్కువ చేసి మాట్లాడాడు.
అక్రమ్ మాట్లాడుతూ.. “‘ఓవల్‌లో సాధారణంగా టెస్ట్ మ్యాచ్‌లు ఆగస్ట్ చివరి వారంలో లేదా సెప్టెంబర్ తొలి వారంలో ప్రారంభమవుతాయి. అప్పుడు పిచ్ డ్రైగా ఉంటుంది కాబట్టి బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. కానీ డబ్ల్యూటీసీ ఫైనల్ జూన్‌లోనే జరుగుతుంది. కాబట్టి పిచ్ చాలా తాజాగా ఉండనుంది. దాంతో ఈ వికెట్‌పై బంతి ఎక్కువగా బౌన్స్ అయ్యే అవకాశం ఉంది.ఓవల్‌లో విపరీతమైన స్వింగ్, బౌన్స్ ఉంటుందని, ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కొవడం టీమిండియా బ్యాటర్ల వల్ల కాదన్నాడు.అంతేకాకుండా ఆసీస్ బౌలింగ్‌తో పోల్చితే భారత బౌలింగ్ కాస్త బలహీనంగా ఉంది. నా అభిప్రాయం ప్రకారం ఆస్ట్రేలియానే ఈ మ్యాచ్ గెలుస్తుంది”. అని వసీం అక్రమ్ ఐసీసీ రివ్యూ కార్యక్రమంలో చెప్పుకొచ్చాడు. మరి వసీం అక్రమ్ చేసిన ఈ వ్యాఖ్యలు మీకేవిధంగా అనిపించాయి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.