క్రికెట్ ప్రపంచంలో పసికూన జట్లుగా ముద్రపడ్డ ఐర్లాండ్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ లాంటి జట్లు శక్తికి మించివు పోరాడుతుంటే.. అంతర్జాతీయ జట్లయిన ఇండియా, న్యూజిలాండ్ లాంటి మేటి జట్లు గెలుపు కోసం బిక్కమొహం వేస్తున్నాయి. మనం ఎలా ఆడితే.. ఏముందిలే మన డబ్బు మనకొస్తదిగా అన్నట్లుగా ఆట తీరును ప్రదర్శిస్తున్నాయి. 6 జట్ల మధ్య జరిగే ఆసియా కప్ కప్ టోర్నీలో ప్రపంచంలో నెంబర్-1 టీంగా చెప్పుకునే భారత జట్టు, కనీసం సూపర్- 4 దశకు కూడా చేరలేక ఇంటిదారి పడితే.. టీ20ల్లో నెంబర్-1గా చెప్పుకునే న్యూజిలాండ్ జట్టు అంతకన్నా దారుణంగా ఆడుతోంది. 200 పరుగుల లోపు లక్ష్యానికి కనీస పోటీ కూడా ఇవ్వలేక 82 పరుగులకే కుప్పకూలింది.
3 వన్డేల సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. తొలి వన్డేలో 2 వికెట్ల తేడాతో ఓటమి పాలైన న్యూజిలాండ్ జట్టు.. రెండో వన్డేలో కూడా అదే ఆటతీరుతో మరోసారి ఓటమిని చవిచూసింది. టాస్ ఒడి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేస్తే.. లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ జట్టు 82 పరుగులకే కుప్పకూలింది. ఒక్క బ్యాటర్ కూడా 20 పరుగులు చేయకపోవడం గమనార్హం.
What a game!
Australia defend 195 and bowl out New Zealand for just 82 runs in the 2nd ODI. pic.twitter.com/w38zczkJ2c
— Govardhan Reddy (@gova3555) September 8, 2022
కాగా, అంతకుముందు టాస్ఓడి బ్యాటింగ్ దిగిన ఆసీస్ జట్టు 55 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయింది. స్టీవ్ స్మిత్(94 బంతుల్లో 61 పరుగులు) మినహా ఏ ఒక్కరూ రాణించింది లేదు. స్టీవ్ స్మిత్ తరువాత మిచెల్ స్టార్క్ (45 బంతుల్లో 38 పరుగులు) హైయెస్ట్ స్కోరర్. చివరకు 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి195 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ ముందు ఉంచింది. ఈ టార్గెట్ చూశాక కివీస్ జట్టు సునాయాసంగా విజయం సాధిస్తుందనుకున్నారు అందరూ. అయితే.. అందరి అంచనాలను తలకిందలు చేస్తూ.. 82 పరుగులకే చాప చుట్టేసింది. కేన్ విలియంసన్ చేసిన 17(58 బంతుల్లో) పరుగులే.. న్యూజిలాండ్ బ్యాటర్లలో హైయెస్ట్ స్కోర్. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 5 వికెట్లతో మ్యాచును శాసించగా, స్టార్క్, హెజెల్ వుడ్ చెరో 2 వికెట్లతో రాణించారు. ఈ విజయంతో 3 వన్డేల సిరీస్ ను ఆస్ట్రేలియా 2-0తో కైవసం చేసుకుంది. ఇక, తదుపరి వన్డే ఇదే వేదికపై, సెప్టెంబర్ 11న జరగనుంది. అంతర్జాతీయ జట్టైన న్యూజిలాండ్ జట్టు నుంచి ఇలాంటి ప్రదర్శన పట్ల.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.