మూడు టెస్టుల సిరీస్ ఆడేందుకు టీమిండియా సౌతాఫ్రికాకు చేరుకుని ప్రాక్టీస్ కూడా చేస్తుంది. ఈ నెల 26 నుంచి మొదటి మ్యాచ్ బాక్సింగ్ డే టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మూడు టెస్టుల సిరీస్ అనంతరం.. మూడు వన్డేల సిరీస్ కూడా భారత్-సౌతాఫ్రికా మధ్య జరగనుంది. కాగా టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందే సౌతాఫ్రికాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జే గాయం కారణంగా సిరీస్ నుంచి తప్పుకున్నాడు.
గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న నోర్జే ఇంకా కోలుకోకపోవడంతో అతను ఈ సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు ఐసీసీ అధికారికంగా వెల్లడించింది. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమిండియాను నిలువరించడంలో నోర్జే లోటు స్పష్టంగా కనిపించడం ఖాయం. ఇది భారత్‌కు కలిసొచ్చే అంశమే. మరి సిరీస్‌కు ముందే సౌతాఫ్రికా కీలక ఆటగాడు సిరీస్‌కు దూరం కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: టీమిండియాకు ఎంపికైన కిరాణాకొట్టు కుర్రాడు! ఇన్‌స్పైరింగ్ స్టోరీ
A big blow for South Africa ahead of the #SAvIND Tests 👇
Anrich Nortje will miss the three-match series as he has “not recovered adequately” from a persistent injury. pic.twitter.com/GSlOwUYixw
— ICC (@ICC) December 21, 2021