దిల్లీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు తాజాగా ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్ మొదలుకావడానికి ముందు అజయ్ జడేజా ప్రత్యర్థి జట్టుని అప్రమత్తం చేశాడు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నాడు.
టీమిండియా రెండో టెస్టుకు సిద్ధమైపోయింది. ఆస్ట్రేలియాతో దిల్లీ వేదికగా శుక్రవారం నుంచి మ్యాచ్ ఆడనుంది. తొలి టెస్టులో గెలిచి ఊపు మీదున్న భారత జట్టు.. ఇందులో విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. అందుకు తగ్గట్లే ప్లాన్స్ కూడా రెడీ చేసుకుంది. మరోవైపు తొలి మ్యాచ్ లో ఓడిపోయేసరికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆసీస్ ఏదో పెద్ద ప్లాన్ వేస్తోంది. ఇలాంటి టైంలో భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆసీస్ జట్టు ఓ విషయం గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఇది కాస్త క్రికెట్ అభిమానుల మధ్య చర్చకు దారితీసింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. నాగ్ పూర్ లో జరిగిన తొలి టెస్టులో పిచ్ స్పిన్ కు అనుకూలంగా మారింది. దీనిపై భారత ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకోగా.. ఆసీస్ క్రికెటర్లు మాత్రం పూర్తిగా చేతులెత్తేశారు. దీంతో ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఈ క్రమంలోనే రెండో టెస్టు కోసం ఆస్ట్రేలియా పలు మార్పులతో బరిలోకి దిగింది. ట్రావిస్ హెడ్ తిరిగి జట్టులోకి వచ్చాడు. టాడ్ మర్ఫీతో పాటు స్పిన్ బాధ్యతల్ని షేర్ చేసుకునేందుకు మథ్యూ కునేమన్ జట్టులోకి వచ్చాడు. ఆసీస్ తరఫున ఇదే అతడికి తొలి మ్యాచ్. అయితే ఈ మ్యాచ్ కంటే ముందు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అజయ్ జడేజా.. ఆస్ట్రేలియా జట్టుని అప్రమత్తం చేస్తూ వ్యాఖ్యలు చేశాడు.
‘దిల్లీ పిచ్ లో బౌన్స్ తక్కువగా ఉంటుంది. కాస్త పచ్చిక ఉంచితే మాత్రం బ్యాటింగ్ కు అనుకూలంగా మారే ఛాన్సుంది. పాక్ పై అనిల్ కుంబ్లే పది వికెట్లు చరిత్ర సృష్టించింది ఈ గ్రౌండ్ లోనే. ఆసీస్ ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిందే. ప్రస్తుతం పిచ్ ని సిద్ధం చేసే పనిలో సిబ్బంది నిమగ్నమై ఉన్నారు. కాబట్టి ఇవాళ పిచ్ ఎలా ఉండనుందనేది తెలిసిపోతుంది. ఇక భారత్ గత టెస్టులో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగాలి’ అని అజయ్ జడేజా చెప్పుకొచ్చాడు. అయితే టీమిండియాలో చిన్న మార్పు జరిగింది. సూర్య కుమార్ యాదవ్ బదులు శ్రేయస్ అయ్యర్ జట్టులోకి వచ్చాడు. ఇది పుజారాకు 100వ టెస్టు కావడం విశేషం. సరే ఇదంతా పక్కనబెడితే అజయ్ జడేజా వ్యాఖ్యలపై మీరేం అంటారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.
Here’s how the teams are stacked up for 2nd Test between #IndVsAus2023. Indian camp, #ShreyasIyer coming in for #SuryakumarYadav while for Australia camp Travis Head returns, in place of Matthew Renshaw, and spinner Matthew Kuhnemann makes his Test debut.#INDvAUS #BGT2023 pic.twitter.com/NdUWzRcdAv
— Cricadium CRICKET (@Cricadium) February 17, 2023