క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట చాలా రికార్డులు ఉన్నాయి. అయితే ఒక రికార్డు మాత్రం అది కీర్తి కంటే.. ఆటలోనే ఒక మైలురాయిగా మిగిలిపోయింది. ఆటకే అందం తెచ్చిన ఆ రికార్డుకి నేటితో 13 ఏళ్లు నిండాయి.
సచిన్ టెండూల్కర్.. ప్రపంచ క్రికెట్‌ను దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ఏలిన రారాజు. ఇండియన్ క్రికెటర్‌కు ఇంటర్‌ఫేస్‌గా నిలిచిన ఆటగాడు. క్రికెట్ ఒక మతమైతే దానికి దేవుడు సచిన్. ఈ మాటలు ఇప్పటి నుంచి కాదు. దాదాపు 20 ఏళ్ల నుంచి వింటూనే ఉన్నాం. 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో సచిన్ సృష్టించిన రికార్డులు ఎన్నో ఉన్నాయి. ప్రపంచ క్రికెట్‌లో మరెక్రికెటర్ సాధించలేదని, ఎవరికీ సాధ్యం కాని రికార్డులెన్నో సచిన్ పేరిట ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే.. సచిన్ లాంటి లాంగ్ కెరీర్‌తో పాటు అతను నెలకొల్పిన 100 సెంచరీల రికార్డును బద్దలు కొట్టే ఆటగాడు కనుచూపుమేరలో కూడా ఎవరూ కానరావడం లేదు.
అనితరసాధ్యమైన బ్యాటింగ్‌తో, అద్భుతం అనిపించే షాట్లతో.. ప్రపంచంలోని ప్రతి గొప్ప బౌలర్‌ను కూడా ఓ ఆట ఆడుకున్న బ్యాటర్ ఎవరైనా ఉన్నారంటే నిస్సందేహంగా అది సచిన్ టెండూల్కరే. పర్ఫెక్ట్ బ్యాటింగ్‌కు ఒక టెక్ట్స్‌బుక్‌లా మారిపోయిన ఘనత ఆయనది. అలాంటి ఆటగాడు.. వన్డే క్రికెట్ చరిత్రలో తొలి సారి లిఖించిన ఓ అరుదైన రికార్డుకు నేటితో 13 ఏళ్లు నిండాయి. అంతవరకు కనీవిని ఎరుగని రికార్డు అది. హార్డ్ హిట్టర్లం, పవర్ హిట్టర్లం, అగ్రెసివ్ బ్యాటర్లం అని చెప్పుకున్న వారికి కూడా సాధ్యం కాని రికార్డు అది. అలాంటి రికార్డును క్రికెట్ దేవుడే తొలి సారి సాధించాడు.
ప్రపంచం మొత్తం అతన్నే క్రికెట్ దేవుడిగా ఎందుకు కొలుస్తుందో అర్థం అయ్యేలా చేసిన రికార్డు అది. వన్డే క్రికెట్ చరిత్రలో తొలి సారి డబుల్ సెంచరి కొట్టి.. సచిన్ టెండూల్కర్ అంటే ఏంటో ప్రపంచ క్రికెట్‌కు మరోసారి నిరూపించిన రోజు 24 ఫిబ్రవరి 2010. గ్వాలియర్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. సెహ్వాగ్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన సచిన్.. ప్రొటిస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 147 బంతుల్లో 25 ఫోర్లు, 3 సిక్సులతో 200 పరుగులు చేసి.. వన్డే మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. సచిన్ సాధించిన తర్వాత ఆ బాటలో చాలా మంది క్రికెటర్లు వన్డేల్లో డబుల్ సెంచరీ కొట్టినా.. సచిన్ డబుల్ సెంచరీ మాత్రం చాలా స్పెషల్. వన్డే క్రికెట్ చరిత్రలోనే అదో అరుదైన రికార్డు. మరి సచిన్ డబుల్ సెంచరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
🗓️ #OnThisDay in 2010
🆚 South Africa2⃣0⃣0⃣* 🫡
Relive the moment when the legendary @sachin_rt became the first batter in Men’s ODIs to score a double century 👏👏pic.twitter.com/F1DtPm6ZEm
— BCCI (@BCCI) February 24, 2023