హైదరాబాద్ సైదాబాద్ లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలిక ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఒక్కొక్కరుగా బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. తాజాగా వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరామర్శించారు. చిన్నారి అమ్మనాన్నలతో మాట్లాడి ఆమె పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ ఇక్కడే ఉంటానని, న్యాయం జరిగే వరకూ బాధిత కుుటుంబం ఇంటి వద్దే దీక్ష చేస్తానని షర్మిల ప్రకటించారు. ఇక ఈ ఘటన జరిగి 6 రోజులు గడుస్తున్నా.. సీఎం కేసీఆర్ ఇంత వరకూ స్పందించలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడుని వెంటనే పట్టుని కఠినమైన శిక్ష విధించాలంటూ ఆమె డిమాండ్ చేశారు. ఇక దీంతో పాటు రాష్ట్రంలో క్రిమినల్ కేసులు మూడు రెట్లు పెరిగాయని దీనికి కారణం సీఎం కేసీఆర్ నిర్ణయాలే షర్మిల అన్నారు.