తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల నగారా మోగింది. ఇటు తెలంగాణలో హుజురాబాద్ నియోజకవర్గం అటు ఏపీలో కడప జిల్లాలోని బద్వెల్ నియోజకవర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో అన్ని పార్టీలు ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు గెలుపు గుర్రాలను సైతం రంగంలోకి దింపింది.
అయితే ఏపీలో బద్వేల్ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మార్చి 28న మృతిచెందటంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక అటు వైసీపీ ఇటు టీడీపీ అభ్యర్ధులను సైతం ప్రకటించారు. తాజాగా ఉన్నట్టుండి టీడీపీ బద్వెల్ ఉప ఎన్నికలకు దూరంగా ఉంటున్నామంటూ ఓ ప్రకటనలో తెలిపింది. ఇదే అంశం ఏపీ రాజకీయాల్లో కాస్త హాట్ టాపిక్ గా మారింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ ఎన్నికల నుంచి దూరం వెళ్లటానికి గల కారణాలు తెలియరాలేదు.