బోరుగడ్డ అనిల్ పేరు ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. కోటంరెడ్డిపై బోరుగడ్డ అనిల్ చేసిన వ్యాఖ్యలు అగ్గి రాజేశాయి. కోటంరెడ్డిని బోరుగడ్డ అనిల్ కార్యాలయానికి కొంతమంది వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో బోరుగడ్డ అనిల్.. ఆవేదనను వెల్లడించారు. ఆ మధ్య చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల మీద సైతం అసభ్య పదజాలంతో దూషించిన సంగతి తెలిసిందే. ప్రముఖ నేతలను విమర్శిస్తూ.. ఫేమస్ అయిన బోరుగడ్డ అనిల్.. కోటంరెడ్డిని బెదిరించడంతో వివాదంలో చిక్కుకున్నారు. కోటంరెడ్డి వ్యవహారంలో బోరుగడ్డ అనిల్ బాగా వైరల్ అయ్యారు. కోటంరెడ్డికి కాల్ చేసి.. బెదిరింపులకు దిగిన ఆడియో వైరల్ అవుతోంది.
నెల్లూరు వీధుల్లో కోటంరెడ్డిని బండికి కట్టి ఈడ్చుకు వెళ్తానంటూ సవాల్ చేశారు. సీఎం జగన్ గురించి మాట్లాడితే చంపేస్తా అంటూ హెచ్చరించారు. అయితే తాను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడినంటూ చెప్పుకు తిరుగుతున్న అనిల్ బోరుగడ్డ బండారాన్ని ఆ పార్టీ నేతలు బయటపెట్టారు. తిరుపతి, చిత్తూరు జిల్లా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకి, బోరుగడ్డ అనిల్ కి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షులు అంజయ్య వెల్లడించారు. బోరుగడ్డ అనిల్ అసలు తమ పార్టీ సభ్యుడు కాదని.. కనీసం పార్టీలో ప్రాథమిక సభ్యత్వం కూడా లేదని అన్నారు. అతనొక రోడ్డున ఉండే రౌడీ స్థాయికి సంబంధించిన వ్యక్తి అని.. అతని మీద ఫిర్యాదు చేసే స్థాయి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియాకి లేదని అన్నారు.
అయితే అతను మాట్లాడే మాట, భాష ఇవన్నీ కూడా పార్టీకి, పార్టీ సిద్ధాంతాలకు నష్టం చేకూరుస్తాయి కాబట్టి ఖండిస్తామని అన్నారు. పార్టీలో గానీ, సంస్థల్లో గానీ, సంఘాల్లో గానీ దీనిపై చర్చ జరుపుతామని, ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, అంబేద్కర్ పేరు చెప్పుకుని బతకాలనుకునేవారికి నిజమైన కార్యకర్తలు అడ్డుకట్ట వేస్తారని అన్నారు. పొడిచేస్తాను, చంపేస్తాను అన్న బోరుగడ్డ అనిల్ కి ఇవాళ ముఖ్యమంత్రిని గన్ మెన్లను కేటాయించాలని అడుక్కునే దుస్థితి ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. ఇవాళ బోరుగడ్డ అనిల్ కి అంబేద్కర్ ని అనుసరించే కార్యకర్తలు గానీ, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా గానీ ఎందుకు అండగా నిలబడలేదో తెలుసుకోవాలని అన్నారు. బోరుగడ్డ అనిల్ లాంటి వారిని ప్రోత్సహించవద్దు అంటూ ఆయన పేర్కొన్నారు. మరి బోరుగడ్డ అనిల్ కి, తమ పార్టీకి సంబంధం లేదని చెప్పడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.