కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా వినిపిస్తోన్న పేరు. ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ వైఎస్సార్ సీపీ పార్టీ నుంచి బయటకు వచ్చి రెబల్ బావుటా ఎగరేశారు కోటంరెడ్డి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు కోటంరెడ్డి వర్సెస్ వైఎస్ ఆర్ సీపీ అన్నట్లుగా తయ్యారు అయ్యింది. గత కొన్ని రోజులుగా వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి, వైఎస్సార్ సీపీ నాయకులకు మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. మాటకు మాట.. కౌంటర్ కు రీ కౌంటర్, సవాల్ కు ప్రతి సవాల్ విసురుకుంటున్నారు నాయకులు. ఈ క్రమంలోనే ప్రభాకర్ రెడ్డి విసిరిన సవాల్ కు స్పందిచారు కోటంరెడ్డి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నా దమ్ముంటే నువ్వు పోటీ చెయ్ అన్న ప్రభాకర్ రెడ్డి మాటలకు కౌంటర్ వేశారు కోటంరెడ్డి.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా వినిపిస్తోన్న పేరు. ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ వైఎస్సార్ సీపీ పార్టీ నుంచి బయటకు వచ్చి రెబల్ బావుటా ఎగరేశారు కోటంరెడ్డి. తన అనుచరులతో పాటుగా ఆ పార్టీ నాయకులపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రభాకర్ రెడ్డి విసిరిన సవాల్ ను స్వీకరిస్తున్నాట్లు కోటంరెడ్డి తెలిపారు. తాజాగా ఓ కార్యక్రమంలో కోటంరెడ్డి మాట్లాడారు. నా ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు హోం శాఖకు ఎందుకు ఫిర్యాదు చెయ్యలేదు అన్నారు కాకాని గోవర్దన్ రెడ్డి. అలాగే నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా టీడీపీ అభివృద్ధి పనులను పొగిడాను అని కోటంరెడ్డి అన్నారు. ఇక నేను ప్రజల మనిషిని, ప్రజల కోసం ఉద్యమం చెయ్యడానికైనా వెనకాడను అని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.
ప్రభాకర్ రెడ్డి మూడు నిమిషాలకు మూడు ముచ్చట్లు చెబుతున్నారు అని కోటంరెడ్డి మండిపడ్డారు. నేను ఇక్కడే పోటీ చేస్తా దమ్ముంటే పోటి చెయ్ అని గతంలో ప్రభాకర్ రెడ్డి అన్నట్లు ఆయన గుర్తుచేశారు. నేను ఎక్కడికి పోనూ.. ఇక్కడే పోటీ చేస్తా.. దమ్ముంటే నువ్వు నాపై పోటీ చెయ అంటూ సవాల్ విసిరాడు కోటంరెడ్డి. నేను ప్రభాకర్ రెడ్డి లా పెద్ద నాయకుడిని కాదని, నేను ఇక్కడే పోటీ చేస్తానని కోటంరెడ్డి చెప్పుకొచ్చారు. అయితే మళ్లీ మాటమార్చిన ప్రభాకర్ రెడ్డి.. పోటీ చేసే విషయంపై 5 సంవత్సరాలకు ఒకసారి నిర్ణయం తీసుకుంటాను అని మాటమార్చాడు అని కోటంరెడ్డి ఎద్దేవాచేశారు.