తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపోందిస్తున్న పథకం దళిత బంధు. ఈ మధ్య కాలంలోనే ఈ పథకానికి తెలంగాణ సర్కార్ రూపకల్నన చేసింది. ఇదే పథకాన్ని మొట్ట మొదటగా హుజురాబాద్‌లో పైలెట్ ప్రాజెక్ట్ కింద అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కానీ అనూహ్యంగా కాస్త రూటు మార్చారు. ప్రతిపక్షాల ఈ పథకంపై రాద్దాంతం చేస్తుండటంతో దీనిని తన దత్తత గ్రామంలో అమలు చేశారు. భువనగిరి యాదాద్రి జిల్లాలోని వాసాలమర్రి అనే గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే.
ఇటీవల ఈ గ్రామంలో పలుమార్లు పర్యటనలను కూడా చేసి గ్రామాన్ని పరిశీలించారు. దీంతో కొన్ని అనూహ్య నిర్ణయాల మధ్య వాసాలమర్రిలో పథకం అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ గ్రామంలో దళిత బంధు పథకాన్ని గురువారం ప్రారంభించారు. కానీ ఈ పథకంలో లబ్దిదారులకు ఎంపిక విషయంలో సర్కార్ కొన్ని కిటుకులు పెట్టింది. అదేంటి అంటారా..? ఈ పథకం దళిత ఎస్సీలను ఉద్దేశించి రూపకల్సన చేశామని సీఎం కేసీఆర్ చెప్పారు.
ఇక లబ్ధిదారుల ఎంపికలో కొన్ని మార్పులు చేసింది. ప్రభుత్వం ఉద్యోగం ఉన్న దళిత కుటుంబాలు ఈ పథకానికి అనర్హులుగా ప్రకటించింది. లబ్ధిదారుల ఎంపిక విషయంలో రాష్ట్ర యంత్రాంగం కొన్ని కమిటీల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్దమైంది. జిల్లా నుంచి మండల, గ్రామ స్థాయి వరకు ఈ పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో కమిటీల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది ఇక ముందు ముందు ఈ పథకానికి ఇంకెన్ని లింకులు పెడతారో అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.