కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై చెడుగుడు ఆడుకున్నారు. తెలంగాణలో బీజేపీ పార్టీ తీరుపై, మోదీ పాలనపై జగ్గారెడ్డి సూటిగా ప్రశ్నించారు. రక్తం తాగి పులిలాంటి స్వభావం ఉన్న పార్టీ బీజేపీ అని ఆయన అన్నారు. ఇక తెలంగాణలో 80 శాతంగా హిందువుల కోసమే పని చేస్తానన్నబండి సంజయ్.. నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటూ సవాల్ విసిరారు జగ్గారెడ్డి.
ఇక హిందువుల కోసం ప్రధానితో మాట్లాడి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించగలవా అంటూ ప్రశ్నించారు. ఇక తెలంగాణలో ఉన్న పేద హిందువులకు మోదీతో మాట్లాడి రూ.15 లక్షలు ఇప్పించగలవా, నిజాం భూములు తీసుకుని హిందువులకు ఇస్తామని చప్పగలిగే దమ్ము ఉందా అంటూ వరుసగా ప్రశ్నల వర్షం బాణాలు ఎక్కుపెట్టారు.