ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన అధికారిక ట్వీట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇంటిలోనే ఐసోలేట్ అయి, చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. ఈ మధ్య కాలంలో తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. కాగా టీడీపీ కార్యకర్తలు, అభిమానులు చంద్రబాబు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
I’ve tested positive for COVID with mild symptoms. I have quarantined myself at home and taking all the necessary precautions.
I would request those who came in contact with me to get themselves tested at the earliest. Please be safe and take care.
— N Chandrababu Naidu (@ncbn) January 18, 2022