‘తోపులాటలో ఆయనకు పెద్దగా దెబ్బలు తగల్లేదు. చిన్నప్పటినుంచి ఎత్తుకుని పెంచిన వ్యక్తిపై ఆమె దాడి చేయించింది. యువగళం యాత్రలో ఈ దాడి చేయించింది. ఆమెకు బుద్ధి లేదు.
ఏవీ సుబ్బారెడ్డిపై దాడి ఘటనకు సంబంధించి నంద్యాల పోలీసులు.. భూమా అఖిల ప్రియ, ఆమె సహచరులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏవీ సుబ్బారెడ్డిపై దాడి ఘటనను ఆయన కూతురు జశ్వంతి తీవ్రంగా తప్పుబట్టారు. భూమా అఖిల ప్రియపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ఈ మేరకు బుధవారం ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోతో తండ్రి ఆరోగ్యంపై కూడా క్లారిటీ ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ..
‘‘తోపులాటలో ఆయనకు పెద్దగా దెబ్బలు తగల్లేదు. చిన్నప్పటినుంచి ఎత్తుకుని పెంచిన వ్యక్తిపై ఆమె దాడి చేయించింది. యువగళం యాత్రలో ఈ దాడి చేయించింది. ఆమెకు బుద్ధి లేదు. మా మీద రెండు సార్లు దాడి జరిగింది. ప్రెస్‌మీట్‌లకు పిల్లాడిని తీసుకురాకుండా.. అరెస్ట్ సమయంలో సంకలో పిల్లాడిని వేసుకుని సింపథీ కోసం ప్రయత్నిస్తోంది. ప్రతీ దానికి ఉమెన్ కార్డ్ వాడుతోంది. ఉమెన్ కార్డుతో ఏదైనా చేసుకోవచ్చని బరితెగించి తిరుగుతోంది. తోటి ఆడవాళ్లుగా అఖిల ప్రియ మహిళ చెప్పటానికి సిగ్గుపడుతున్నాం.
అఖిల ప్రియ నీచమైన బతుకు బతుకుతోంది. ఆళ్లగడ్డనుంచి కానీ, నంద్యాల నుంచి కానీ, టికెట్ ఇస్తే.. నేను గానీ, మా నాన్న గానీ పోటీ చేయటానికి సిద్ధంగా ఉన్నాం. అఖిల ప్రియకు సీటు ఇస్తే.. ఆ పతనం కోసం పని చేస్తాము. ఆమెను ఓడగొట్టడం కోసం పని చేస్తాను. ఆఖిల ప్రియకు తగిన శాస్తి జరుగుతుంది. ఆమె చేసిన ప్రతి పనికి శిక్ష అనుభవిస్తుంది. ఆమె చేసిన దానికి తగిన శాస్తి జరుగుతుంది. ఆమెకు టికెట్ వస్తే.. మా వర్గం ఓడించటానికే పని చేస్తుంది’’ అని అన్నారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.