ఓటీటీల కారణంగా ప్రేక్షకులకు మూవీస్, వెబ్ సిరీస్ ద్వారా ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ దొరుకుతుంది. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలు మాత్రమే ఇతర భాషల్లోకి అనువాదమయ్యేవి. ఇప్పుడీ ఓటీటీల కారణంగా ఇతర భాషల్లో మంచి టాక్ తెచ్చుకున్న మూవీస్ రీజనల్ లాంగ్వేజెస్‌లోకి డబ్ అవుతున్నాయి.
ఓటీటీల కారణంగా ప్రేక్షకులకు మూవీస్, వెబ్ సిరీస్ ద్వారా ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ దొరుకుతుంది. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలు మాత్రమే ఇతర భాషల్లోకి అనువాదమయ్యేవి. ఇప్పుడీ ఓటీటీల కారణంగా ఇతర భాషల్లో మంచి టాక్ తెచ్చుకున్న మూవీస్ రీజనల్ లాంగ్వేజెస్‌లోకి డబ్ అవుతున్నాయి. సాధారణంగా ఓటీటీ ప్రియులు ఈ వీకెండ్ ఫ్యామిలీతో కలిసి ఏ సినిమా చూడాలి? అంటూ కొంత సేపు సెర్చ్ చేసిన తర్వాత ఓ మూవీకి ఫిక్స్ అయిపోతారు. అలాంటివారు ఈ వారాంతం తప్పకుండా తమ వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకోవాల్సిన సినిమా ‘తండట్టి’. పశుపతి, రోహిణి, వివేక్ ప్రసన్న, అమ్ము అభిరామి తదితరులు నటించారు. రామ్ సంగయ్య దర్శకుడు. సినిమా ఎలా ఉంటుందో క్లుప్తంగా చూద్దాం.
సుబ్రహ్మణ్యం (పశుపతి) హనెస్ట్ పోలీస్ కానిస్టేబుల్. ముక్కుసూటితనం వల్ల ఎప్పుడూ ట్రాన్స్‌ఫర్ అవుతుంటాడు. మరో 10 రోజుల్లో రిటైర్ అవుతాడనగా.. తను పని చేస్తున్న స్టేషన్‌కు ఓ కేసు వస్తుంది. తన నాయనమ్మ (తంగపొన్ను) కనబడడంలేదంటూ ఓ పిల్లాడు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులంటే ఏ మాత్రం గిట్టని కిడారిపట్టి అనే ఊరు బయల్దేరతాడు. తంగపొన్ను దొరికిందని సంతోషించేలోగానే చనిపోతుంది. ఆమె దహన సంస్కారానికి ఏర్పాట్లు జరుగుతుండగా.. ఎంతో విలువైన ఆమె బంగారు దిద్దులను ఎవరో మాయం చేస్తారు. వాటిని దొంగిలించింది ఎవరు?, తంగపొన్ను ఫ్లాఫ్ బ్యాక్ ఏంటి?, సుబ్రహ్మణ్యం దొంగలను పట్టుకున్నాడా? అనేది అసలు కథ.
నటీనటుల పర్ఫార్మెన్స్, టెక్నీషియన్ల పనితీరు, కథ, కథనాలు, నేపథ్య సంగీతం, ముఖ్యంగా క్లైమాక్స్ మెయిన్ హైలెట్. నేటి సమాజంలో మనుషుల మధ్య బంధాల ఎంత పేలవంగా ఉన్నాయో చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. మంచి ఎమోషనల్ సీన్లతో ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేశాడు. చిన్న పాయింట్ అయినా నేచురల్‌గా చెప్పిన విధానం ఆకట్టుకుంటుంది. ఓటీటీలో ఇంత మంచి సినిమాలు రావడం లేదు అనే ముందు ‘తండట్టి’ లాంటి చిత్రాలు వచ్చినప్పుడు తప్పకుండా చూడడం మాత్రం మిస్ అవకండి.