ప్రముఖ ఓటీటీల్లో ఫ్రీగా కొత్త సినిమాలు చూడాలనుకుంటున్నారా? అయితే ఈ బంపర్ ఆఫర్ మీకోసమే. ఎలానో తెలియాలంటే లేటు చేయకుండా ఈ స్టోరీ చదివేయండి.
మనలో చాలామందికి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్ ఉండవు. ప్రతివారం రిలీజయ్యే కొత్త సినిమాలు చూడటం కోసం పైరసీ సైట్స్ వెంటపడుతుంటాం. అలా కాదు మీకు ఓటీటీల్లోనే, అది కూడా సబ్ స్క్రిప్షన్ అవసరం లేకుండా ఫ్రీగా మూవీస్ చూసే ఛాన్స్ వస్తే ఏం చేస్తారు? అదేం పిచ్చిప్రశ్న.. కచ్చితంగా దీన్ని యూజ్ చేసుకుంటాం అని అంటారు. ఇప్పుడు ఆ లక్కీ ఛాన్స్ మీ దగ్గరకి వచ్చేసింది. మేం చెబుతున్నది అక్షరాలా నిజం. ఇంతకీ ఏ సినిమాలు, ఎందులో చూడొచ్చనేది తెలియాలా?
అసలు విషయానికొచ్చేస్తే.. థియేటర్లలో కొత్త సినిమాలు చూడాలంటే టికెట్ రేట్స్ ఆకాశంలో ఉంటాయి. రూ.200కి అస్సలు తక్కువ ఉండట్లేదు. అది పక్కనబెడితే సరైన మూవీస్ ఈ మధ్య కాలంలో ఒక్కటి రావడం లేదు. దీంతో చాలామంది ఓటీటీల వంక చూస్తున్నారు. దీన్ని సరిగా క్యాష్ చేసుకుంటున్న సదరు సంస్థలు.. యూజర్స్ ని పెంచుకునే పనిలో పడ్డాయి. సమ్మర్ స్పెషల్ పేరుతో ఫ్రీగా కొత్త సినిమాలు చూసే ఛాన్స్ అందిస్తున్నాయి. ఏదో ఒక్క ఓటీటీలో కాదు.. టాప్ యాప్స్ అన్నీ అదే రూట్ లో వెళ్తున్నాయి. లాగిన్ ఏం అవసరం లేకుండా ప్లే స్టోర్ లో సదరు యాప్ ని ఇన్ స్టాల్ చేసుకుంటే సినిమాలు చూసేయొచ్చు.
రీసెంట్ గా ఓటీటీ ఫీల్డ్ లో దూసుకెళ్తున్న ‘జియో సినిమా’.. హిందీతో పాటు తెలుగు కంటెంట్ పై దృష్టి పెట్టింది. రీసెంట్ గా తమ యాప్ లో రిలీజైన విక్రమ్ వేద, భేడియా, కచ్చి లింబు లాంటి హిందీ మూవీస్ తోపాటు ‘థగ్స్’, ‘బూ’ తదితర తెలుగు చిత్రాల్ని ఫ్రీగా చూసే అవకాశం కల్పించింది. ‘సమ్మర్ బాక్సాఫీస్’ పేరుతో ఆహా కూడా ఇలాంటి సదుపాయాన్ని తీసుకొచ్చింది. రీసెంట్ గా కలర్ ఫోటో, క్రాక్, మసూద, డీజే టిల్లు చిత్రాల్ని తలా ఓ రోజు ఫ్రీగా స్ట్రీమింగ్ చేసింది. సమ్మర్ అయిపోయేంతవరకు ఏరోజుకి ఆరోజు ఉదయం ఏ సినిమా ఫ్రీగా చూడొచ్చు సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతోంది. జీ5 ఓటీటీ కూడా ‘బింబిసార’ తొలి 15 నిమిషాలు ఉచితంగా చూసే అవకాశమిచ్చింది. పూర్తిగా చూడాలంటే మాత్రం సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. సో అదనమాట విషయం. మరి పైన చెప్పిన విషయం మీలో ఎవరికైనా తెలుసా? ఒకవేళ తెలియకపోతే మాత్రం ఈ సదావకాశాన్ని త్వరగా యూజ్ చేసుకోండి.