బాలీవుడ్లో ఈ ఏడాది రిలీజైన చిత్రాల్లో బంపర్ హిట్‌గా నిలిచిన అతి కొద్ది మూవీస్‌లో ‘ది కేరళ స్టోరీ’ ఒకటి. అదా శర్మ హీరోయిన్గా నటించిన ఈ సినిమా హిందీతో పాటు ఇతర భాషల్లోనూ మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పటికే ఓటీటీలోకి రావాల్సిన ఈ మూవీ.. ఇంకా ఆలస్యం అవుతోంది.
అదా శర్మ.. సినీ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. తన నటనతో, గ్లామర్‌తో ఎంతో మంది ఫ్యాన్స్ హృదయాలను దోచుచుకున్నారామె. ఉత్తరాదికి చెందిన ఈ భామకు అసలైన సక్సెస్‌ను అందించింది మాత్రం టాలీవుడ్ అనే చెప్పాలి. కెరీర్ కొత్తలో ‘1920’, ‘ఫిర్’, ‘హమ్ హే రాహి కార్ కే’ లాంటి హిందీ చిత్రాల్లో నటించినప్పటికీ అదా శర్మకు బ్రేక్ రాలేదు. ఆమెను తెలుగులోకి ఇంట్రడ్యూస్ చేశాడు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. హీరో నితిన్ సరసన ‘హార్ట్ ఎటాక్’లో హీరోయిన్గా నటించే ఛాన్స్‌ను ఇచ్చాడు పూరి. ఆ మూవీలో హయతి పాత్రలో అమాయకమైన నటనతో ఆకట్టుకున్నారు అదా శర్మ. ఆ తర్వాత ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’, ‘క్షణం’, కల్కి’ లాంటి సినిమాలతో తన క్రేజ్‌ను మరింతగా పెంచుకున్నారామె. అయితే అందం ఉన్నా, అన్ని హిట్లు ఉన్నా ఆమెకు అంతగా మూవీ ఆఫర్లు మాత్రం రాలేదు.
తెలుగులో సినిమాలు చేస్తూనే బాలీవుడ్లో ప్రయత్నాలు సాగించారు అదా శర్మ. ఈ క్రమంలో ‘ది హాలీ డే’, ‘పతీ పత్నీ ఔర్ వో’, ‘కమాండో’ సిరీస్‌తో పాటు పలు చిత్రాల్లో నటించారు. కానీ ఆమెకు సూపర్ సక్సెస్, స్టార్‌డమ్‌ను సంపాదించి పెట్టింది మాత్రం ‘ది కేరళ స్టోరీ’నే. ఈ సమ్మర్లో రిలీజైన ఈ మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. రూ.40 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ చిత్రం.. ఏకంగా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. అయితే ఈ సినిమా జూన్ 23న ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని న్యూస్ వచ్చింది. కానీ ఆ తేదీకి ఓటీటీలో అందుబాటులోకి రాలేదు. దీనిపై తాజాగా హీరోయిన్ ఆదా శర్మ క్లారిటీ ఇచ్చారు. ‘ది కేరళ స్టోరీ’ని ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు ఇవ్వాలనే విషయంపై నిర్మాతలు ఆలోచిస్తున్నారని ఆమె చెప్పారు. బిగ్ స్క్రీన్స్‌లో మూవీ సూపర్ హిట్ కావడంతో.. ఓటీటీ రిలీజ్ విషయంలోనూ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ప్రొడ్యూసర్స్ భావిస్తున్నట్లు తెలిపారు.