కొన్ని అద్భుతాలు జరుగుతుంటే మన కళ్లను మనమే నమ్మలేం. అవి మళ్లీ మళ్లీ రిపీట్ అవుతున్నాయంటే చూడకుండా ఉండగలమా అదే జరగనుంది గురువారం. హైదరాబాద్ వాసులు మరోసారి అరుదైన సంఘటనను ఆస్వాదించి, సాక్ష్యాలుగా మారనున్నారు.
కొన్ని అద్భుతాలు జరుగుతుంటే మన కళ్లను మనమే నమ్మలేం. అవి మళ్లీ మళ్లీ రిపీట్ అవుతున్నాయంటే చూడకుండా ఉండగలమా అదే జరగనుంది గురువారం. హైదరాబాద్ వాసులు మరోసారి అరుదైన సంఘటనను ఆస్వాదించి, సాక్ష్యాలుగా మారనున్నారు. ఇంతకు ఏంటో ఆ అద్భుతమని ఆలోచిస్తున్నారా. అదేనండీ గురువారం కొన్ని నిమిషాల పాటు హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాల్లో వారి నీడ వారికి కనిపించదు. ఈ సారి తమ నీడ కనిపించకపోయినా బహుశా ఆశ్చర్యపోరేమో హైదరాబాదీలు. ఎందుకంటే గతంలో ఓసారి కొన్ని నిమిషాల పాటు తమ నీడ మాయమైన దాఖలాలను చవిచూశారు కదా మరి. అదేనండీ జీరో షాడో డే. మరోసారి హైదరాబాద్ వాసులు తమ నీడను పొగొట్టుకోబోతురన్న మాట.
ఈ నెల 3వ తేదీన అనగా గురువారం హైదరాబాద్ వాసులకు తమ నీడ కనిపించదు. గురువారం మధ్యాహ్నం 12.23 నిమిషాలకు నీడ మాయం కానుంది. సుమారు రెండు నిమిషాల పాటు ఈ అద్భుతాన్ని వారు చూడొచ్చు. సూర్యకిరణాలు వస్తువు, మనిషిపై నిట్టనిలువుగా పడటం వల్ల వాటి నీడ మాయమైనట్లు కనిపిస్తుంది. దీన్నే జీరో షాడో డే అంటారు. ఈ ఏడాది కర్ణాటకతో పాటు హైదరాబాద్లో జీరో షాడే డే ఆవిష్కృతమైన సంగతి విదితమే. హైదరాబాద్ లో మే 9న మధ్యాహ్నం 12.12 గంటల నుంచి 12:14 అంటే రెండు నిమిషాల వ్యవధిలో నీడ మాయమైన సంగతి విదితమే. ఆ సమయంలో అనేక మంది రోడ్ల మీదకు వచ్చి.. తమ నీడను పరీక్షించుకున్నారు కూడా. ఇప్పుడు మరోసారి ఆగస్టు 3న హైదరాబాద్లో కొన్ని నిమిషాల పాటు నీడ కనిపించదని బిర్లా సైంటిస్టులు గతంలోనే చెప్పారు.