స్పెషల్ డెస్క్- జబర్దస్త్ జడ్జ్, వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్, నగరి ఎమ్మెల్యే రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఉన్న రోజా ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం వైసీపీ పార్టీలో కొనసాగుతూ, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యేగా ఉన్నారు. జబర్దస్త్ కామెడిషో కు జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు రోజా.
ఇక రోజా పాలిటిక్స్, సినిమాలు, బల్లి తెర కార్యక్రమాలతో పాటు సోషల్ మీడియాలోను చాలా యాక్టీవ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన కుటుంబంతో గడిపిన క్షణాలను అభిమానులతో పంచుకుంటారు. ఇక రోజా గారాల కూతురు అన్షు మాలిక సైతం తల్లికి తగ్గ తనయురాలు. చదువుతో పాటు అన్ని రంగాల్లోను తన ప్రతిభను చాటుతోంది అన్షు.
తాజాగా రోజా కూతురు అన్షు మాలికకు అరుదైన గౌరవం దక్కింది . ప్రఖ్యాత ఇన్ఫ్లూఎన్సర్ యూకే మ్యాగజైన్ కవర్ పేజీపై ఆమె ఫొటోను ప్రచురించారు. రచయితగా, ఎంట్రప్రెన్యుయర్ గా, ప్రోగ్రామర్‌గా సమాజం కోసం పాటుపడుతున్నందుకు యంగ్ సూపర్ స్టార్ అవార్డుకు ఎంపికైనట్లు ఇన్ఫ్లూఎన్సర్ సంస్థ ప్రకటించింది. ఇంకేముంది తన కల నెలవేరిందని సంతోష పడింది అన్షు మాలిక. ఇటీవలే బర్న్ అచీవర్ మ్యాగజైన్ కవర్ పేజీపై కూడా క్వీన్ ఆఫ్ టాలెంట్ గా అన్షు ఫోటో ప్రచురించారు.
ఇక తన ముద్దుల కూతురుకు దక్కిన అరుదైన గౌరవానికి రోజా ఇబ్బితబ్బిబ్బవుతున్నారు. ఈ సందర్బంగా రోజా కుటుంబ సభ్యులు, సన్నిహితులు చిన్నపాటి సెలబ్రేషన్ కూడా జరుపుకున్నారని తెలుస్తోంది. అన్షు మాలికకు ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇవ్వాలని రోజా అనుకుంటున్నారట. మరి తన గారాలపట్టి అన్షుకు రోజా ఎలాంటి బహుమతి ఇస్తుందో చూడాలి.