పొద్దున లేచిన దగ్గర నుండి రాత్రి పొద్దుపోయే వరకు చెట్టపట్టాలేసుకుకొని తిరుగుతుంటారు ప్రేమ జంటలు. ప్రేమ పక్షులల్లే విహరించిందీ చాలదని, చాటుమాటు వ్యవహారాలు చేసుకునేందుకు పార్కులు, చీకటి ప్రాంతాలను, చెట్టు, పుట్టలు చూసుకుంటారు.
ప్రేమికులం మేం ప్రేమికులం మా ప్రేమను ఆపేదెవరు అంటూ పొద్దున లేచిన దగ్గర నుండి రాత్రి పొద్దుపోయే వరకు చెట్టపట్టాలేసుకుకొని తిరుగుతుంటారు జంటలు. ప్రేమ పక్షులల్లే విహరించిందీ చాలదని, చాటుమాటు వ్యవహారాలు చేసుకునేందుకు పార్కులు, చీకటి ప్రాంతాలను, చెట్టు, పుట్టలు చూసుకుంటారు. ఇక ముద్దు ముచ్చట్లకు కొదవ ఉండదు. అయితే గతంలో గుట్టుగా సరసాలు చేసుకునేవారు ప్రేమ పక్షులు. ఇప్పుడు మాత్రం కొంత మంది లవర్స్ బాహాటంగానే రెచ్చిపోతున్నారు. బైకులు, బహిరంగ ప్రాంతాల్లోనే కౌగిలింతలు, ముద్దులు, ఇతర పనులు చక్కబెడుతున్నారు. ఇప్పుడు ఏ స్థాయికి పాకిందంటే హెరిటేజ్ ప్రాంతాల్లో కూడా అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నారు.
హైదరాబాద్ వంటి మహానగరాల్లో పార్కులకు కొదవ లేదు. కానీ లవర్స్ చారిత్రాత్మక కట్టడం అయిన చార్మినార్ మీద వెకిలి పనులు చేస్తూ, పర్యాటకులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. చార్మినార్ హైదరాబాద్‌కు తలమానికం. భాగ్య నగరి పేరు చెప్పగానే ముందుకు గుర్తుకు వచ్చేది చార్మినార్. ఆతర్వాత గోల్కోండ కోట. ఎప్పుడైనా నగరానికి వచ్చిన వారు చార్మినార్‌ను చూడకుండా వెళ్లలేరు. ముఖ్యంగా నైట్ వ్యూను చూసేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. అయితే ఇప్పుడు ఆ చార్మినార్ చుట్టూ అంధకారం అలముకుంది. దీంతో అసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది. ప్రేమికుల పిచ్చి పనులతో పర్యాటకులు విసిగి చెందడం, వారి ముందే లవర్‌తో అసభ్యంగా ప్రవర్తించడం, ప్రశ్నిస్తే దాడి చేస్తున్నారు.
ఈ ఘటనపై పలు ఫిర్యాదులు అందడంతో పోలీసులు చర్యలు చేపడుతున్నారు. అర్థరాత్రి చార్మినార్‌కు వెళ్లే ప్రధాన రహదారులను మూసేస్తున్నారు. దీంతో పర్యాటకులు రాత్రి వ్యూ చూద్దామని వచ్చి చీకట్లోనే సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. చార్మినార్ కు మరింత మెరుగులు దిద్దేందుకు ఇల్యూమినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 190 వాట్ల ఎల్‌ఈడీ లైట్లు కూడా అమర్చారు. దీంతో మిరుమిట్లు గొలిపే లైట్లతో చార్మినార్ మరింత శోభయామానంగా వెలుగొందుతోంది. అయితే ప్రేమికుల చర్యల వల్ల పోలీసులు ఆంక్షలు విధించడంతో పర్యాటకులు ఆ అందాన్ని చూడకుండానే వెనుదిరుగుతున్నారు.