స్వశక్తిని నమ్ముకుని ఇండస్ట్రీలో స్టార్ డమ్ అందుకున్న అతికొద్ది మంది హీరోలలో విశ్వక్ సేన్ ఒకరు. “ఈ నగరానికి ఏమైంది”, “హిట్” చిత్రాలతో విశ్వక్ తనని తాను నిరూపించుకున్నాడు. ఇక ఇప్పుడు పాగల్ మూవీతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్దమయ్యాడు విశ్వక్. దిల్ రాజు సమర్పణ లో నరేష్ కుప్పిలి పాగల్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. విశ్వక్ సేన్ సరసన సిమ్రాన్ చౌదరీ, నివేథా పేతురాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 14 వ తేదీన విడుదల కానుంది. దీంతో.., తాజాగా మూవీ యూనిట్ పాగల్ మూవీ ట్రైలర్ ని విడుదల చేసింది.
ఈ చిత్రంలో విశ్వక్ సేన్ ప్లే బాయ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. 2 నిమిషాల 15సెకండ్స్ నిడివి ఉన్న ఈ ట్రైలర్ ని బట్టి చూస్తే.. హీరో.. కనిపించిన ప్రతి అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తూ, లైఫ్ ని చాలా ఈజీగా లీడ్ చేస్తుంటాడు. ఇలాంటి సమయంలో హీరోయిన్ వల్ల అతనికి నిజమైన ప్రేమ ఏమిటో తెలిసి వస్తుంది. ఆ తరువాత హీరో.. తనని తాను మార్చుకుని, తన ప్రేమని ఎలా దక్కించుకున్నాడు అన్నదే కథ గా తెలుస్తోంది. నిజానికి ఇదేమి కొత్త కథ కాదు. అప్పట్లో వెంకటేశ్ చేసిన “ప్రేమతో రా”, అక్కినేని అఖిల్ చేసిన “మిస్టర్ మజ్ను” చిత్ర కథలు కూడా ఇదే. కాకుంటే ఈ పాయింట్ ని ఎంత కొత్త చూపించబోతున్నారన్న దాని మీదే పాగల్ ఫలితం ఆధారపడి ఉంటుంది.
ఇక ట్రైలర్ లో విశ్వక్ సేన్ కాస్త బొద్దుగా కనిపించాడు. హీరోయిన్స్ అందం పాగల్ మూవీకి అదనపు ఆకర్షణగా నిలవనుందని ట్రైలర్ చూస్తూనే అర్ధం అయిపోతోంది. టెక్నీకల్ గా, ప్రొడక్షన్ పరంగా పాగల్ ఎక్కడా కాంప్రమైజ్ అయినట్టు కనిపించడం లేదు. పాగల్ ట్రైలర్ లో ప్రధానంగా ఆకట్టుకుంది మాత్రం కెమెరా వర్క్. డీవోపీ అదిరిపోయింది. ఇన్ని మంచి శకునాలు కనిపిస్తున్న పాగల్ మూవీ.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. మరి.., పాగల్ ట్రైలర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.