అంతా సవ్యంగా ఉంటే ప్రకృతి మనల్ని కడుపులో పెట్టుకుని అమ్మలా కాస్తుంది. కానీ.., ఆ ప్రకృతి ప్రకోపిస్తే మాత్రం ఆ కోపాన్ని మానవులు తట్టుకోలేరు. ఇక ఈ మధ్య కాలంలో ఇలాంటి ప్రకృతి ప్రకోపాలు తరుచుగా జరుగుతూనే ఉన్నాయి. ఇక తాజాగా ఇలాంటి ఘటనే హర్యానా రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
భారీ వర్షాలకు భూమి కుంగడం, చీలడం, కోసుకుపోవడం.. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాము. కానీ.., భూమి తనంతట తానే అమాంతం పైకి లేయడం మీరు ఎప్పుడైనా చూశారా? తాజాగా హర్యానాలో ఇలాంటి వింత సంఘటనే చోటు చేసుకుంది. కర్నాల్-కైతాల్ రహదారిపై ఉన్న పొలం నుంచి ఒక కాలువ మార్గం ఉంది. హర్యానాలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో.., ఆ కాలువ సమీప ప్రాంతం అంతా వర్షపు నీటితో నిండిపోయింది. ఇక.. ఈ శుక్రవారం వర్షం కాస్త తగ్గడంతో రైతులు అంతా పొలం పనుల కోసం ఆ కాలువ ప్రాంతానికి చేరుకున్నారు.
రైతులంతా పొలం పనుల్లో ఉండగా.. అకస్మాత్తుగా భూమి పైకి లేవడం కనిపించింది. నీరు నిండివున్న ప్రాంతంలో భూమి వేగంగా పైకి పెరగడం ప్రారంభించింది. భూమి పైకి లేయడంతో వర్షం నీరంతా పళ్ళానికి ఒరిగిపోయాయి. ఇక ఈ దృశ్యం చూసిన రైతులు భూకంపం వచ్చింది ఏమో.. అనుకుని అక్కడ నుండి దూరంగా పరుగులు తీశారు. కొందరు మాత్రం ఈ దృశ్యాన్ని దైర్యంగా తమ కెమెరాల్లో బంధించి.., సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దీంతో.., ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
हरियाणा में जमीन उठने की अनोखी घटना ने सबको हैरान कर दिया है। करनाल के निसिंग नर्दक नहर के पास पानी भरे खेतों में जमीन अचानक कई फुट ऊपर उठ गई। इससे काफी दूर तक खेत असमतल हो गए हैं। कहीं जमीन कई फुट ऊपर उठी हुई है तो कहीं बड़ा सा गड्ढा बन गया है।@JagranEnglish @cmohry #ViralVideo pic.twitter.com/6rDxjiLIcB
— amit singh (@Join_AmitSingh) July 22, 2021
అయితే.., భూమి పైకి లేచే సమయంలో భూమి లోపల నుండి పెద్దగా ధ్వనులు వచ్చాయని రైతులు.. అధికారులకి తెలియచేశారు. అధికారులు మాత్రం ఇలాంటి ఘటన చూడటం ఇదే మొదటిసారని.., సరైన వివరాలు తెలిసే వరకు స్థానికులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.ఇక భూమి పైకి లేచిన వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అక్కడికి స్థానికులు భారీ ఎత్తున చేరుకుంటున్నారు. మరి.. ఈ వింత ఘటనకి కారణం ఏమై ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.