ఆదాయానికి మించిన ఆస్తులు ఉంటే ఆ భయం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్రమంగా డబ్బులు సంపాదించడం, వాటిని తెలియకుండా మేనేజ్ చేయడం.. వాటి కాపాడుకునేందుకు అనుక్షణం టెన్షన్ పడడం ఇవన్నీ అధికారుల విషయంలో జరుగుతూనే ఉంటాయి.
ఆదాయానికి మించిన ఆస్తులు ఉంటే ఆ భయం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్రమంగా డబ్బులు సంపాదించడం, వాటిని తెలియకుండా మేనేజ్ చేయడం.. వాటి కాపాడుకునేందుకు అనుక్షణం టెన్షన్ పడడం ఇవన్నీ అధికారుల విషయంలో జరుగుతూనే ఉంటాయి. తాజాగా ఒక ఉన్నతాధికారి విషయంలో అలాంటి సంఘటనే జరిగింది. నాబారంగ్ పూర్ జిల్లా అదనపు సబ్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ రౌత్ పై ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలు వచ్చాయి. విజిలెన్స్ అధికారులు శుక్రవారం తెల్లవారు జామునే రంగంలోకి దిగారు. భువనేశ్వర్ లో ఆయన ఇంట్లో సోదాలు మొదలుపెట్టారు. దీంతో ఆయన ఆరు బాక్సుల్లో నగదు నింపి పక్కింటి టెర్రస్ పై విసిరాడు.
అయితే ఈవిషయం గుర్తించిన అధికారులు ఆ డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ అధికారి ఇటీవలే 2000 రూపాయల నోట్లను 500 రూపాయల నోట్లుగా మార్పిడి చేయించారు. అయితే ఇక్కడ 2.25 నగదు పట్టు పడిందని.. దాచి పెట్టిన ఆరు బాక్సులను సీజ్ చేశామని సీనియర్ విజిలెన్స్ అధికారి తెలియజేసాడు. మరో తొమ్మిది ప్రాంతాల్లోను ఏకకాలంలో దాడులు చేపట్టారు. ఈ క్రమంలో నాబారంగ్ పూర్ లో మరో 77 లక్షలు పట్టుబడ్డాయి. మొత్తంగా చూసుకుంటే 3 కోట్లకు పైగానే స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలో మైనింగ్ మాఫియాకు సహకరిస్తూ.. రౌత్ పెద్ద మొత్తంలో అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇతను 2018 లో కూడా లంచం కేసులో ఒకసారి అరెస్ట్ అయ్యాడు. ఆ సమయంలో బ్లాక్ డెవలప్ మెంట్ ఆఫీసర్ గా పని చేస్తున్నాడు.