కుక్క యజమానుల తిక్క కుదిరే కఠిన నిబంధనలు తీసుకొచ్చింది.. ఒడిశా ప్రభుత్వం. కుక్క కాటేయడమే కాదు.. కుక్కల చేత యజమానులు బహిరంగ మల, మూత్ర విసర్జన చేయించినా జరిమానా కట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఇటీవల కాలంలో కుక్కల బెడద ఎక్కువైన సంగతి అందరికీ విదితమే. కనపడ్డ వారిని కాటేయడమే కాదు, పసిపిల్ల ప్రాణాలు కూడా తీస్తున్నాయి. పోనీ ఈ దాడులకు దిగుతోంది వీధి కుక్కలు ఒక్కటేనా అంటే కాదు. పెంపుడు కుక్కలు సైతం కనపడ్డవారిని కాటేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుక్క కాట్లు, అరవడం వంటి విషయాల్లో యజమానులు, ఇరుగుపొరుగుకు మధ్య గొడవల నేపథ్యంలో భువనేశ్వర్ మున్సిపల్ కార్పోరేషన్ కొత్త బై లా రూపొందించింది. ఆ వివరాలు..
భువనేశ్వర్ మున్సిపల్ కార్పోరేషన్ రూపొందించిన కొత్త నిబంధనల ప్రకారం.. ఇకపై కార్పోరేషన్ పరిధిలో ఎవరినైనా కుక్క కరిస్తే ఆ కుక్క యజమానికి రూ.10 వేల వరకు జరిమానా విధించనున్నారు. అలాగే, కుక్కల యజమానులు తమ కుక్కల చేత బహిరంగ మల, మూత్ర విసర్జన చేయించినా జరిమానా కట్టాల్సి ఉంటుందని పొందుపరిచారు. అంతేకాదు కొన్నాళ్లు పెంచి ఆపై మోజు తీరాక వాటిని వీధుల్లో వదిలేస్తున్నారు. ఇకపై ఇలా వదిలేసినా జరిమానా ముక్కుపిండి వసూలు చేస్తామని హెచ్చరించారు. కుక్కల యజమానులకు వణుకు పుట్టించే ఇలాంటి నిబంధనలు చాలానే అందులో పొందుపరిచారు. ఇలాంటి రూల్స్ మన తెలుగు రాష్ట్రాలలో కూడా అమలులోకి తెస్తే బాగుటుందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Owners of dogs in Bhubaneswar will be fined Rs 10,000 in the case of dog bite incidents, BMC passes new laws in this regard.#Bhubaneswar #Odisha #DogOwners #Fine #DogBite pic.twitter.com/7Ch39qB1oW
— Odisha Bhaskar (@odishabhaskar) May 1, 2023