ఆమెకు ప్రియుడంటే ఎంతో ప్రాణం. ప్రేమించిన వాడితోనే జీవితాంతం ఉండాలని ఆశపడింది. ప్రియుడే నా సర్వస్వం అంటూ ఏవేవో కలల కనింది. కానీ.. చివరికి ఆమె ఆశలపై నీళ్లు చల్లిన ప్రియుడు కాసులకు కక్కుర్తి ఊహించని నీచానికి పాల్పడ్డాడు. దీంతో భరించలేని ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవల ఒడిశాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భువనేశ్వర్ లో సౌమ్యజిట్ మోహనపాత్ర, శ్వేత అనే ఇద్దరు కలిసి ఇంజనీరింగ్ చదువుకున్నారు. చదువుకునే రోజుల్లో వీరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే చివరికి ప్రేమగా మారింది. దీంతో ఒకరికొకరు నచ్చుకోవడంతో పీకల్లోతు ప్రేమలో మునిగితేలారు. కొన్నాళ్ల పాటు ఈ ప్రేమికులు ప్రేమ విహారంలో తేలియాడుతూ సినిమాలు, షికారులు అంటూ తెగ తిరిగారు. అలా కలిసి తిరగడంతో వీరి ప్రేమ పీక్ స్టేజ్ లోకి వెళ్లిపోయింది. దీంతో ప్రియుడు ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక కోరికలు తీర్చుకున్నాడు. ఇటీవల శ్వేత ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని కోరింది. దీనికి నిరాకరించిన ప్రియుడు.., నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటూ నాకు రూ.30 లక్షల కట్నం కావాలంటూ డిమాండ్ చేశాడు.
ఇదే విషయమై వీరిద్దరూ ఇటీవల ఓ పబ్ లో కలుసుకుని మాట్లాడుకునే ప్రయత్నంచేశారు. కానీ ప్రియుడు మాత్రం ఆమెను వదిలించుకునే ప్రయత్నంలో అనేక ఎత్తులు వేశాడు. ప్రియుడి ప్రవర్తనను గమనించిన ప్రియురాలు అప్పటి నుంచి అతనితో మాట్లాడడమే మానేసింది. ఇక కొన్నిరోజుల తర్వాత శ్వేత మరోసారి ప్రియుడికి ఫోన్ చేసి మాట్లాడాలనుకుంది. కానీ ఎంతకు కూడా అతను కాల్ లిఫ్ట్ చేయలేదు. దీంతో మరింత మనస్థాపానికి గురైన శ్వేత ఆత్మహత్యకు పాల్పడింది.
ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకపోవడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. అనంతరం ఆమె కుటుంబ సభ్యులు ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రియుడు కట్నం పేరుతో కొన్నాళ్ల నుంచి వేధింపులకు గురి చేశాడని, దీని కారణంగా మా అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడిందని వారు ఆరోపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ప్రేమించిన ప్రియురాలిని మోసం చేయడమే కాకుండా.., కాసుల కోసం కక్కుర్తిపడి చివరికి ప్రియురాలి మరణానికి కారణమయ్యాడు. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.