ఫిల్మ్ డెస్క్- తెలుగు యంగ్ హీరో విజయ్ దేవరకొండకు అభిమానుల్లో మంచి క్రేజ్ ఉంది. విజయ్ చేసింది తక్కువ సినిమాలే అయినా ఈ జనరేషన్ హీరోల్లో ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం, అర్జున్ రెడ్డి వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రధానంగా యూత్ ను అట్రాక్ట్ చేసే క్యారెక్టర్స్ తో ఒవైపు క్లాస్, మరోవైపు మాస్ ఆడియన్స్ కు అబిమాన హీరో అయ్యాడు విజయ్ దేవరకొండ.
ఇక ఈ రౌడీ హీరోకు లేడీ ఫాలోయింగ్ బాగా ఎక్కువ. అందులోను యంగ్ హీరోయిన్లు విజయ్ దేవరకొండ స్టైల్ కు ఫ్యాన్స్ అయిపోతున్నారు. విజయ్ దేవరకొండ సినిమా హీరోలు, హీరోయిన్స్ తో బాగా కలిసిపోతాడు. హీరోయిన్స్ ఐతే చెప్పక్కర్లేదు. విజయ్ అంటే పడి చచ్చిపోతారంతే. సమయం చిక్కితే చాలు పార్టీలు, పబ్స్ అంటూ మజా చేస్తుంటాడు విజయ్. యంగ్ హీరోయిన్స్ అందుకే విజయ్ దేవరకొండపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపుతుంటారు.
శ్రద్ధా కపూర్, ఆలియా భట్ లాంటి అందాల భామలు విజయ్ దేవరకొండ తమ ఫేవరేట్ హీరో అని చెప్పగా, ఇప్పుడు ఆ లిస్టులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కూడా చేరింది. విజయ్ దేవరకొండ అంటే తనకు ఎంతో ఇష్టమని ఈ మధ్యే చెప్పంది కియారా. ఈ క్రమంలో వీళ్లిద్దరు కలిసి దిగిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కియారా అద్వానీ పక్కన విజయ్ దేవరకొండ ఒంటిపై నూలుపోగు లేకుండా కనిపించారు. ఐతే ఈఫోటో గోవా బీచ్ లో తీసిందన్ తెలుస్తోంది. అన్నట్లు విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు.