కియారాకు చెప్పులు వేసుకోవటంలో ఆయన సహాయం చేశారు. స్వయంగా ఆమెకు చెప్పులు అందించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సినిమా ఇండస్ట్రీకి.. సమాజానికి మధ్య.. ఆకాశానికి భూమికి మధ్య ఉన్నంత దూరం ఉంటుంది. సామాన్య ప్రజలు చేయాలనుకుని.. సమాజం కోసం భయపడి ఆగిపోయే పనుల్ని సినిమాలు ఇట్టే చేసేస్తుంటారు. అందుకే ప్రజలు కూడా సినిమా వాళ్ల విషయాల గురించే ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. సమాజం కోసం బతకటం సామాన్య ప్రజల జీవితం అయితే.. తమ కోసం తాము బతకటం సినిమా వాళ్ల జీవితం. అందుకే విడాకులు, గొడవలు, ఎఫైర్లు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా హైలెట్ అవుతుంటాయి. ఏమి జరిగినా.. ఎన్ని జరిగినా సినిమా వాళ్లు తమకు నచ్చిందే చేసుకుపోతుంటారు.
ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే.. తాజా సంఘటన. బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్.. కియారాకు చెప్పులు వేసుకోవటంలో సహాయం చేశారు. ఆమె చెప్పుల్ని చేత్తో పట్టుకుని అందించారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీలు హీరో,హీరోయిన్లుగా బాలీవుడ్లో ‘సత్య ప్రేమ్ కి కథా’ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా సాంగ్స్ లాంఛ్ కార్యక్రమం జరిగింది. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమానికి చిత్ర బృందం మొత్తం హాజరైంది.
ఈ సందర్భంగా కియారా అద్వానీ ఓ పాటకు డ్యాన్స్ వేయటానికి స్టేజి మీదకు వెళ్లారు. అయితే, ఆమె హైహిల్స్ వేసుకుని ఉండటంతో వాటిని విప్పి పక్కకు పడేశారు. డ్యాన్స్ చేయటం అయిపోయిన తర్వాత చెప్పులకోసం వెతికారు. ఈ సమయంలో కార్తీక్ ఆమెకు సహాయం చేశారు. స్వయంగా తన చేత్తో చెప్పుల్ని ఆమెకు అందించారు. ఆమె వాటిని ధరించి కార్తీక్‌తో పాటు స్టేజీ దిగేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.