లస్ట్ స్టోరీస్ 2 సిరీస్ లో బోల్డ్ సీన్స్ లో నటించి రచ్చ చేసింది మిల్కీ బ్యూటీ తమన్నా. ప్రియుడు విజయ్ వర్మతో కలిసి రొమాంటిక్ సీన్లలో మునిగిపోయింది. అయితే ఆ సీన్లు చేయడానికి భారీ రెమ్యూనరేషన్ అందుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.
టాలీవుడ్ లో తన అందంతో అభినయంతో ఆకట్టుకుని ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది నటి తమన్నా. హుషారైన డ్యాన్సులతో క్రేజీ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. తెలుగులో శ్రీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మిల్కీ బ్యూటీ ఆ తరువాత టాప్ హీరోలతో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా రాణించింది. తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ సినిమాల్లో నటించి గుర్తింపు పొందింది. ఇండస్ట్రీలో హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోయింది. కాగా రీసెంట్ గా వచ్చిన లస్ట్ స్టోరీస్ 2లో బోల్డ్ సీన్స్ లో నటించి అందాలు ఆరబోసింది ఈ ముద్దుగుమ్మ. తన సినీ కెరీర్ లో మునుపెన్నడు చేయని విధంగా ఇంటిమేట్ సీన్స్ తో రచ్చ చేసింది. అయితే తమన్నా మొదటగా ఆ సీన్స్ చేయడానికి ఒప్పుకోలేదట. దీంతో ఆమెకు భారీగా రెమ్యూనరేషన్ ముట్టజెప్పారని సినీ వర్గాలు కోడై కూస్తున్నాయి.
లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ లో నటి తమన్నా రొమాంటిక్ సీన్లతో పిచ్చెక్కించ్చింది. గతంలో ఎప్పుడూ ముద్దు సీన్లలో నటించని తమన్నా ఈ సిరీస్ లో మాత్రం నటించడానికి ఓకె చెప్పింది. తన ప్రియుడు విజయ్ వర్మతో రొమాంటిక్ సీన్లు చేసి ఫుల్ పబ్లిసిటీ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే అంతకు ముందెప్పుడు ముద్దు సీన్లలో నటించని మిల్కీ బ్యూటీ లస్ట్ స్టోరీస్ సిరీస్ లో ఆ సీన్స్ చేయడానికి అంగీకరించింది. తమన్నా ఈ సిరీస్ లో చేసిన బోల్డ్ సీన్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఈ సీన్స్ కోసం రూ. 7 కోట్ల రెమ్యునరేషన్ అందించారని కథనాలు వినిపిస్తున్నాయి. కాగా ముందు ఈ సిరీస్ చేయడానికి తమన్నా ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఆ కారణంతోనే రూ. 4 కోట్లు ఉన్న రెమ్యూనరేషన్ ను రెట్టింపు చేశారని వినిపిస్తోంది. ఈ సిరీస్ లో ఇంటిమేట్ సీన్లతో కుర్రాళ్లలో హీట్ పెంచేసింది తమన్నా. ఇదిలా ఉంటే ఈ సిరీస్ తర్వాత మళ్లీ సినిమా అవకాశాలు క్యూ కట్టడంతో బిజీగా మారిపోయింది మిల్కీ బ్యూటీ తమన్నా.