బాలీవుడ్ అందాల భామ కియారా అద్వానా 2014 లో ఫగ్లీ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగు లో రెండు చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు తర్వాత బాలీవుడ్ కి పయణం అయ్యింది.
తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది బాలీవుడ్ బ్యూటీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.. వారిలో చాలా తక్కువ మంది సక్సెస్ అందుకున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను, రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ మూవీలో నటించింది. నటించిన రెండు చిత్రాల్లో గ్లామర్ గా కనిపించినా పెద్దగా సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. బాలీవుడ్ లో మాత్రం వరుస విజయాలు అందుకుంది. ఈ బాలీవుడ్ భామకు బాలీవుడ్ నటుడు సిద్దార్థ్ మల్హోత్రాతో ఫిబ్రవరి 7వ తేదీన రాజస్థాన్ జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో వివాహం జరిగింది. తాజాగా వాఘా సరిహద్దులో భారత జవాన్లతో కలిసి సందడి చేసింది. దీనికి సంబందించిన వీడియో వైరల్ అవుతుంది.
బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. నటించింది రెండు చిత్రాలే అయినా ఈ అమ్మడు తన అందచందాలతో కుర్రాళ్ల మతులు పోగొట్టింది. కియారా భారత జవాన్లతో కలిసి సందడి చేసింది.. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం కియారా నటిస్తున్న ఓ మూవీ షూటింగ్ అమృత్ సర్ లో జరుగుతుంది. అయితే దగ్గరలోని వాఘా బార్డర్ కు వెళ్లి మిలటరీ బలగాలను కలిసి తన దేశ భక్తిని చాటుకుంది. జవాన్లతో ఫోటోలు దిగారు.. అలాగే జాతీయ జెండాను ఊపుతూ దేశంలోని నిజమైన హీరోలతో సమయం గడపడం ఆనందంగా ఉందన్నారు. వారితో చాలా సేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఒక చెట్టును కూడా నాటారు.
ఈ సందర్భంగా ఆగస్టు 15 సంబరాల్లో భాగంగా దేశ వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వాఘా సరిహద్దులో జవాన్లతో సమయాన్ని గడపడం చాలా ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. జాతీయ జెండాను చేతబట్టి జవాన్లతో కలిసి ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘ఈ రోజు అమృత్ సర్‌లో జాతీయ జెండాతో కియరా అద్వానీ ఎంతో ముందుగా ఉందో..’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కియారా దేశ భక్తిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కియారా చివరిగా కార్తీక్ ఆర్యన్ నటించిన ‘సత్య ప్రేమ్ కి కథ’ మూవీలో కనిపించింది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీలో నటిస్తుంది.
#KiaraAdvani how cute she is with the flag 🥹❤️@advani_kiara today in Amritsar pic.twitter.com/lotoXoQeNX
— Kiara Advani Queen👑 (@kiara_obsessed) August 7, 2023