ఏ భాషలో మొదలుపెట్టినా.. చివరికి సక్సెస్ అయ్యారా లేదా? అనేది పాయింట్. హీరోలంటే ఎక్కడివారు అక్కడే ముందు హిట్ అయ్యాక వేరే భాషలలో ట్రై చేస్తుంటారు. కానీ.. హీరోయిన్స్ అలా కాదు. మోడలింగ్ ద్వారా సినిమాలలో అడుగుపెట్టినప్పటికీ.. కెరీర్ లో మొదటి హిట్ ఏ భాషలో కొడతారనేది చెప్పలేం. టాలీవుడ్ లో ఎక్కువగా తెలుగు హీరోయిన్స్ కంటే.. ఎక్కువగా వేరే భాషలకు చెందిన బ్యూటీలే కనిపిస్తుంటారు. మీరు ఇప్పుడు పైన ఫోటోలో తొర్రిపళ్ళతో నవ్వుతున్న బ్యూటీ కూడా ఆ కోవకే చెందుతుంది.
సినీ కెరీర్ ఏ భాషలో మొదలుపెట్టినా.. చివరికి సక్సెస్ అయ్యారా లేదా? అనేది పాయింట్. హీరోలంటే ఎక్కడివారు అక్కడే ముందు హిట్ అయ్యాక వేరే భాషలలో ట్రై చేస్తుంటారు. కానీ.. హీరోయిన్స్ అలా కాదు. మోడలింగ్ ద్వారా సినిమాలలో అడుగుపెట్టినప్పటికీ.. కెరీర్ లో మొదటి హిట్ ఏ భాషలో కొడతారనేది చెప్పలేం. మనం రెగ్యులర్ గా చూస్తుంటాం.. టాలీవుడ్ లో ఎక్కువగా తెలుగు హీరోయిన్స్ కంటే.. ఎక్కువగా వేరే భాషలకు చెందిన బ్యూటీలే కనిపిస్తుంటారు. మీరు ఇప్పుడు పైన ఫోటోలో తొర్రిపళ్ళతో నవ్వుతున్న బ్యూటీ కూడా ఆ కోవకే చెందుతుంది. ఎందుకంటే.. ఆమె పుట్టిపెరిగిన ప్రదేశం వేరు. కెరీర్ స్టార్ట్ చేసిన ఇండస్ట్రీ వేరు. కట్ చేస్తే.. స్టార్ హీరో సరసన తెలుగు డెబ్యూ.
తెలుగులో మొదటి సినిమానే సూపర్ హిట్.. ఒక్కసారిగా టాలీవుడ్ కి మరో అందమైన బ్యూటీ దొరికిందని అందరూ అనుకున్నారు. అవును.. నిజంగానే దొరికింది.. ఈసారి సెకండ్ మూవీ ఛాన్స్ కూడా స్టార్ హీరోనే ఇచ్చాడు. కానీ.. భారీ ఎక్స్ పెక్టేషన్స్ మధ్య రిలీజైన రెండో మూవీ బాక్సాఫీస్ వద్ద ప్లాప్ టాక్ సొంతం చేసుకుంది. ఇన్ని క్లూస్ ఇచ్చాక ఆల్రెడీ మీకు ఫోటోలో బ్యూటీ ఎవరో తెలిసే ఉంటుంది కదా! ఇంకా తెలియలేదా.. సరే మరో క్రేజీ క్లూ ఇస్తా. సెకండ్ మూవీ ఛాన్స్ ఇచ్చిన హీరోనే.. ఇప్పుడు మూడో సినిమా ఛాన్స్ కూడా ఇచ్చాడు. సెకండ్ మూవీ ప్లాప్ అయినా.. వీరి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. సో.. ఈసారి పాన్ ఇండియా రేంజ్ మూవీతో రాబోతున్నారు.
ఇప్పుడు ఇచ్చిన క్లూతో ఆ బ్యూటీ ఎవరో కనిపెట్టేశారు కదా! ఎస్.. ఫోటోలో పాప ఎవరో కాదు.. కియారా అద్వానీ. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘భరత్ అనే నేను’ మూవీతో తెలుగు డెబ్యూ చేసిన ఈ ముంబై సొగసరి.. రెండో సినిమాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ‘వినయ విధేయ రామ’ చేసింది. ఆ సినిమా ప్లాప్. అయినా వీరి పెయిర్ కి మంచి పేరు రావడం.. పైగా అమ్మడికి బాలీవుడ్ లో సూపర్ క్రేజ్ ఉండేసరికి.. ఈసారి డైరెక్టర్ శంకర్ తో చేస్తున్న RC15 మూవీలో కూడా కియారా అద్వానీకి ఛాన్స్ ఇచ్చారు. మొత్తానికి అమ్మడు ఓవైపు బాలీవుడ్ మూవీస్ చేస్తూనే.. త్వరలోనే తెలుగు సినిమాతో పాన్ ఇండియా వైడ్ పరిచయం కాబోతుంది. ఇటీవలే హీరో సిద్ధార్థ్ మల్హోత్రాని లవ్ మ్యారేజ్ చేసుకొని గుడ్ న్యూస్ కూడా చెప్పింది. ప్రస్తుతం కియారాకి చైల్డ్ హుడ్ లో తొర్రిపళ్ళతో కనిపిస్తున్న పిక్ నెట్టింట వైరల్ గా మారింది. మరి కియారా చిన్ననాటి పిక్ పై, ఆమె చేసిన సినిమాల గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.