మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయంలో అభిమానులని పలకరిస్తూనే ఉంటున్నాడు. ట్రిపుల్ ఆర్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన తర్వాత చరణ్ స్టార్ డం రోజు రోజుకు పెరుగుతూ ఉందే కానీ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇదే నెలలో రామ్ చరణ్ పుట్టిన రోజు ఉన్న నేపథ్యంలో.. అభిమానులని ఖుషి చేయడానికి రెడీ అవుతున్నాడట. మార్చ్ 27న RC15 నుండి టైటిల్, పోస్టర్ రివీల్ చేయనున్నారని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయంలో అభిమానులని పలకరిస్తూనే ఉంటున్నాడు. ట్రిపుల్ ఆర్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన తర్వాత చరణ్ స్టార్ డం రోజు రోజుకు పెరుగుతూ ఉందే కానీ ఏ మాత్రం తగ్గడం లేదు. ట్రిపుల్ ఆర్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిన మెగా పవర్ స్టార్.. ఈ మధ్యనే గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో ఉన్నాడు. ఈ నెల 12 న అకాడమీ అవార్డుల ప్రదానోత్సవ ఫంక్షన్ లో చరణ్ హాజరవ్వనున్నాడు. అయితే.. ఇదే నెలలో రామ్ చరణ్ పుట్టిన రోజు ఉన్న నేపథ్యంలో.. అభిమానులని ఖుషి చేయడానికి రెడీ అవుతున్నాడట. మార్చ్ 27న RC15 నుండి టైటిల్, పోస్టర్ రివీల్ చేయనున్నారని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం రామ్ చరణ్ తమిళ అగ్ర దర్శకుల్లో ఒకరైన శంకర్ దర్శకత్వంలో ఈ RC15 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడట. అయితే.. ఇప్పుడు చిత్ర యూనిట్ ఈ సినిమాకి సంబంధించి టైటిల్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా.. ఈ సినిమా టైటిల్ రివీల్ చేయనున్నారని తెలుస్తోంది. పొలిటికల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాకి సంబంధించి పలు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయట. ఈ చిత్రానికి ఇదివరకే సర్కారోడు అనే టైటిల్ ని పెడుతున్నారని వార్తలు వచ్చాయి. కానీ.. తాజాగా ఈ సినిమాకి “సిఈవో”(CEO) అనే టైటిల్ ని ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న ఈ సినిమాకి సీఈవో అనే టైటిల్.. అన్ని భాషల్లో ఒకేలా ఉండటం ప్లస్ కాబోతుంది. మరి వస్తున్న కథనాల ప్రకారం.. ఈ సినిమాకు సీఈవో టైటిల్ పెడతారా లేదా? వేరే ఏవైనా ప్లాన్ చేసి సర్ప్రైజ్ చేస్తారో చూడాలి. ఇక ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. మరి RC15 పై మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో కామెంట్స్ రూపంలో తెలుపండి.
#RC15 టైటిల్…..C..E..O అని పరిశీలనలో టాప్ లో వుంది
…@AlwaysRamCharan— devipriya (@sairaaj44) March 8, 2023