స్పెషల్ డెస్క్- కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద ఔషధం.. ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. కరోనా కు ఆనందయ్య మందు అద్భుతంగా పనిచేస్తుందని ప్రచారం జరగడంతో దేశ వ్యాప్తంగా అందరి దృష్టి నెల్లూరు పై పడింది. పెద్ద ఎత్తున కరోనా రోగులు ఆనందయ్య మందు కోసం కృష్ణపట్నంకు బారులు తీరడంతో అది కాస్త వివాదం అయ్యింది. ఇప్పుడు ఆనందయ్య కరోనా మందుపై పరిశోధనలు జరపాలన్న డిమాండ్ తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగాయి. కృష్ణపట్నం ఆనందయ్య కరోనా ఔషధంపై ప్రస్తుతం రీసెర్చ్ జరుగుతోంది. దీంతో ఆనందయ్య కరోనా మందు ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు ఆనందయ్య లాగే గతంలో ప్రముఖ ఆహార నిపుణులు వీరమాచినేని రామకృష్ణ కూడా వివాదాస్పదమయ్యారు.
తాను చెప్పే డైట్ వల్ల షుగర్, బీబీ, ఉబకాయం పూర్తిగా తగ్గించుకోవచ్చని రామకృష్ణ చెప్పడం సంచలనం రేపింది. అప్పుడు రామకృష్ణ డైట్ ను సైతం అంతా వ్యతిరేకించారు. విమర్శలు గుప్పించారు, ఆరోపణలు చేశారు. ఇదిగో ఇప్పుడు సేమ్ ఆనందయ్య కరోనా మందుపై కూడా ఇలాగే జరుగుతోంది. ఇటువంటి సమయంలో కృష్ణపట్నం ఆనందయ్య ఔషధంపై స్పందించారు వీరమాచినేని రామకృష్ణ. కరోనాకి సరైన వైద్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, కొంతమంది డాక్టర్లు బుద్ది, బుర్ర లేకుండా పనిచేస్తున్నారని రామకృష్ణ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయమన దివంగత గాయకుడు ఎస్పీ బాలు మరణాన్ని గుర్తు చేశారు. ఎస్పీ బాలుని హత్య చేసింది ఎవరు.. వీళ్లు కాదా అని రామకృష్ణ ప్రశ్నించారు. డాక్టర్లు ఆయన్ని చంపేసి తప్పించుకుని తిరగడం లేదా అని మండిపడ్డారు.
బాలు హాస్పటల్ కు ఎంచక్కా నడుచుకుంటూ, పాటలు పాడుకుంటూ వెళ్లాడని వీరమాచినేని గుర్తు చేశారు. కానీ ఆస్పత్రికి వెళ్లిన ఆ గాన గంధర్వుడు మాత్రం తిరిగిరాలేదని.. వైద్యులు ఆయనపై ప్రయోగాలు చేసి చంపేశారని ఆరోపించారు. ఇప్పుడు కృష్ణపట్నం ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య ఔషధానికి కరోనా తగ్గుతుందని నిరూపితం అయినా, మన కేంద్ర ప్రభుత్వం, మీడియా దాన్ని తొక్కి అవతల పడేస్తున్నారని వీరమాచినేని మండిపడ్డారు. ఆనందయ్య మందు వచ్చినా వేరే వాళ్లు మందు వచ్చినా ఇంగ్లీషు మందుల కంపెనీలు, ఆస్పత్రులకు లక్షల కోట్లు దోపిడీ కుదరదు కాబట్టి, వ్యాపార ప్రయోజనాలకోసం ఇలాంటి ఆనందయ్యలు ఎంత మంది వచ్చినా వారిని తొక్కేస్తారని ఆయన ఆరోపించారు. అందుకని ఆనందయ్య మందును కరోనాకు బ్రహ్మాండంగా వాడుకోవచ్చని డైట్ నిపుణులు వీరమాచినేని రామకృష్ణ తేల్చి చెప్పారు.