ఫిల్మ్ డెస్క్- తీస్ మార్ ఖాన్.. ప్రముఖ సీనియర్ నటుడు సాయి కుమార్ తనయుడు ఆది తాజా సినిమా. విజన్ సినిమాస్ బ్యానర్ పై నాగం తిరుపతి రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ తీస్ మార్ ఖాన్ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. నాటకం మూవీ ఫేమ్ కళ్యాణ్ జి గోగణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తీస్ మార్ ఖాన్ లో ఆది సాయి కుమార్ సరసన పాయల్ రాజ్‌పుత్ జంటగా నటిస్తోంది. అంతే కాదు హీరో కం కమేడియన్ సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఈ క్రమంలో హీరో వరుణ్ తేజ్ తీస్ మార్ ఖాన్ సినిమా లోని.. పాప ఆగవే.. పాటను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా విడుదల చేశాడు. ఈ సాంగ్ చాలా బాగుందని మూవీ యూనిట్‌ని అభినందించిన వరుణ్ తేజా, ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్పాడు.
ఈ పాటకు భాస్కర భట్ల లిరిక్స్ అందించారు. ప్రముఖ గాయకుడు కారుణ్య ఆలపించాడు. సాయి కార్తీక్ అందించిన సంగీతంతో పాటు హీరో హీరోయిన్స్ ఆది సాయి కుమార్, పాయల్ రాజ్‌పుత్ లతో షూట్ చేసిన రొమాంటిక్ సీన్స్ ఈ పాటలో హైలైట్ అయ్యాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు.
అన్నట్లు సాయి కుమార్ కు, మెగా ఫ్యామిలీ మధ్య మంచి అనుబంధం ఉందన్న సంగతి అందరికి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, సాయి కుమార్ బంధం ఈనాటిది కాదు, చాలా యేళ్ల స్నేహ బంధం. ఈ క్రమంలోనే అది తీస్ మార్ ఖాన్ మూవీ ప్రమోషన్స్ కోసం వరుణ్ తేజ్ ముందుకు వచ్చాడు. ఇక సాయి కుమార్ తనయుడు ఆది సాయి కుమార్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో తీస్ మార్ ఖాన్ సినిమా విడుదలకు సిద్దమవుతోంది.
Happy to launch a refreshing melody #PapaAgave from #AadiSaiKumar‘s #TeesMaarKhan https://t.co/Bevf5GWX0Y
My best wishes to the entire team😊@starlingpayal @Mee_Sunil @shamna_kkasim @kalyankumarraja #NagamTirupathiReddy @ThirmalYalla @ImSaiKartheek @TheSaiSatish
— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) February 4, 2022