తక్కువ వయసులోనే తండ్రి ఆశయాలను, అవసరాలను అర్ధం చేసుకుని.. తమని తాము విజేతలుగా మలుచుకుంటూ ఉండే పిల్లలు చాలా అరుదు. ఆట పాటల్లోనే మునిగి తేలుతుంటారు. చదువు, ఇతర వ్యాపకాలపై శ్రద్ధ పెట్టడం చాలా తక్కువ. అలాంటిది 14 ఏళ్ళ వయసులోనే తండ్రి కళ్ళల్లో ఆనందాన్ని చూసిన ఓ కొడుకు కథ ఇది.
కష్టం ఎక్కడ ఉంటుందో.. దాన్ని అధిగమించడానికి ఆలోచన కూడా అక్కడే ఉంటుంది. కానీ.., దాన్ని ఎప్పుడు, ఎవరి ద్వారా మనం పొందుతామో అన్నదే సమస్య. కానీ.., చాలా మంది తల్లితండ్రులకు కష్టకాలంలో బిడ్డలు ఆసరాగా నిలుస్తూ ఉంటారు. వారు చాలా తక్కువ వయసులోనే తండ్రి ఆశయాలను, అవసరాలను అర్ధం చేసుకుని.. తమని తాము విజేతలుగా మలుచుకుంటూ ఉంటారు. అలా 14 ఏళ్ళ వయసులోనే తండ్రి కళ్ళల్లో ఆనందాన్ని చూసిన ఓ కొడుకు కథ ఇది. అతని పేరు “దేవ్ షా”. మరి.. ఈ కుర్రాడు సాధించిన ఘనత ఏమిటి? ఇంత తక్కువ వయసులో 41 లక్షలు ఎలా గెలిచాడు వంటి అన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
దేవ్ షా తండ్రి పేరు దేవల్. ఈయన 29 ఏళ్ల కిందట అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. దేవ్ షా కూడా అక్కడే జన్మించాడు. ఉండేది ఫ్లోరిడాలోనే అయినా వాళ్ళది కూడా ఓ సాధారణ ఎగువ స్థాయి కుటుంబం. అందరిలా ఆశలు, ఆశయాలతో జీవిస్తూ వస్తున్నారు. కానీ.. వీరి కుమారుడు “దేవ్ షా” కథ మాత్రం పూర్తి వ్యతిరేకం. దేవ్ ఓ వండర్ కిడ్. 3 ఏళ్ళ వయసు నుండే ఆటల్లో, చదువుల్లో చురుగ్గా ఉంటూ వచ్చాడు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా చెప్పలేని ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ అవలీలగా చెప్సేయడం అతడి ప్రత్యేకత. అతనిలోని ఈ స్పెషల్ టాలెంట్ గుర్తించిన తండ్రి దేవల్.. కొడుకుకి ఆ దిశగా శిక్షణ ఇప్పించాడు. శిక్షణ దేవ్ షా మరింత రాటుదేలాడు. అమెరికాలో ఏటా జరిగే ప్రతిష్టాత్మక స్పెల్లింగ్ బీ పోటీల్లో రెండు సార్లు పాల్గొన్నా విజేతగా మాత్రం నిలువలేకపోయాడు. కానీ.., దేవ్ ఈ మూడో ప్రయత్నంలో మాత్రం అద్భుతం సృష్టించాడు.
భారత సంతతికి చెందిన దేవ్ షా ఈసారి అన్నీ అవరోధాలను ధాటి స్పెల్లింగ్ బీ కాంపిటేషన్ లో ఫైనల్ కి చేరుకున్నాడు. మొత్తం కోటి పది లక్షల మందిలో కేవలం 11 మంది మాత్రం తుది పోటీకి అర్హత సాధించారంటే.. ఈ కాంపిటేషన్ ఎంత కష్టంగా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. అయితే.. భారత కాలమానం ప్రకారం.. గురువారం రాత్రి 2023 స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ ఫైనల్ జరిగింది. ఈ ఫైనల్ లో దేవ్ షా.. “psammophile” అనే పదానికి సరిగ్గా స్పెల్లింగ్ చెప్పి విజేతగా నిలిచాడు. తెలుగు ఈ పదానికి ఇసుకులో ఉండే జీవులు అని అర్ధమట. దీంతో దేవ్ షాకి “2023 స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ” ట్రోఫీ లభించింది. అలాగే.. 50వేల డాలర్ల క్యాష్ ప్రైజ్ అందుకున్నాడు. మన కరెన్సీలో దీని విలువ అక్షరాల 41 లక్షల రూపాయలు. విజేతగా నిలిచిన అనంతరం దేవ్ షా మాట్లాడుతూ.. నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. నా కాళ్లల్లో ఇంకా వణుకు తగ్గలేదు అంటూ తండ్రికి కృతజ్ఞత చెప్తూ గట్టిగా హత్తుకున్నాడు. చూశారు కదా.. ఇది 14 ఏళ్ళ వయసులోనే 41 లక్షలు గెలిచిన ఓ కొడుకు కథ. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.