ఈ దేశంలో వయసు మీద పడినా.. పెళ్లికాని ప్రసాదుల సంఖ్య రోజు రోజుకు పెరుగి పోతుంది. ఉద్యోగాల కోసం పుస్తకాలతో కుస్తిపడుతూ పెళ్లి అనే మాటనే మరిచిపోతున్నారు. ఇక వీరిది ఇలా ఉంటే.. పెళ్లి చేసుకుందామని అనుకుంటే.. అమ్మాయి దొరకకపోవడం అనేది మరో సమస్యగా మారింది. ఇక పెళ్లి చేసుకుందామని ముందుడుగు వేసినా అమ్మాయి దొరకడం లేదని చాలా మంది యువకులు వాపోతున్నారు. మహారాష్ట్రలోని కొందరు యువకులు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి దొరకడం లేదని రోడ్డెక్కి నిరసనలు తెలియజేస్తున్నారు.
ये बारात नहीं प्रदर्शन है…जी हां, महाराष्ट्र के सोलापुर में शादी के लिए लड़की नहीं मिली तो डीएम ऑफिस के बाहर युवाओं ने किया प्रदर्शन, दूल्हे की तरह सज निकाली बारात#Maharashtra #ViralVideo #Protest pic.twitter.com/bDIPucE4Cw
— Zee News (@ZeeNews) December 22, 2022
మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో మూడు పదుల వయసు దాటినా ఇంకా చాలా మందికి పెళ్లిలు కాలేదు. దీంతో ఆ జిల్లాలోని యువకులు అంతా వినూత్నంగా నిరసన తెలియజేశారు. పెళ్లిబట్టలు ధరించి గుర్రాలపై ఎక్కి పరెడ్ నిర్వహించారు. బ్యాండ్ మేళంతో మాకు వధువు కావాలంటూ ఫ్లకార్డులు పట్టుకుని యువకులు వినూత్నంగా నిరసన తెలియ చేశారు. బ్రైడ్ గ్రూమ్ మోర్చ సంఘంలోని సభ్యులు అంతా ఒక చోటకు చేరి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. మహారాష్ట్రలోని ఆడ-మగ నిష్పత్తిని పెంపొందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. PCPNDT చట్టం కఠినంగా అములు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక భ్రూణ హత్యలు, అసమానతల కారణంగానే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని ఆ యువకులు ఆవేదన వ్యక్తం చేశారు.