స్వల్పంగా పెరిగిన బంగారం ధర
10గ్రా 22 క్యారెట్ 100 రూపాయలు పెరిగింది
10గ్రా 24 క్యారెట్ 120 రూపాయలు పెరిగింది
22 క్యారెట్ 10గ్రా బంగారం 43,700.
24 క్యారెట్ 10గ్రా బంగారం 47,680.
1కిలో వెండి 67,500
బిజినెస్ డెస్క్- ఈ రోజు శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. గురువారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ గ్రాము 10 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ గోల్డ్ ధర కూడా గ్రాముకు 12 రూపాయలు పెరిగింది. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 100 రూపాయలు పెరిగి 43 వేల700 రూపాయలు చేరింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 120 రూపాయలు పెరిగి 47 వేల 680 రూపాయలకు చేరింది. ఇక ఈ రోజు వెండి ధరలో మార్పు లేదు. ఈ రోజు మార్కెట్లో వెండి కిలొ 67 వేల 500 రూపాయలు పలుకుతోంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 1200 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములు 1300 రూపాయలు తగ్గింది.
ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం 43 వేల 970 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ బంగారం 10 గ్రాములు 47, 970 రూపాయలుగా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ బంగారం 10 గ్రాములు 45, 550 రూపాయులుండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం 46, 550 రూపాయలు పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం 45,760 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాములు 49, 920 రూపాయలుగా ఉంది. రేపు కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం దిగుమతులు తగ్గడం బంగారం ధరలపై ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు.