సోనూసూద్ ఈ పేరును దేశం అంత సులువుగా మారిపోదు. కరోనా సమయంలో ప్రేజలకు అండగా నిలిచి రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు సోనూసూద్. వేల మంది వలస కార్మికులను గమ్యస్థానాలకు చేర్చి వారి పాలిట దైవంగా మారాడు. ఓవైపు కరోనా పై యుద్ధం చేస్తూ నిత్యం సామాన్యులకు సేవలను అందిస్తూ వైద్యసిబ్బందికి కూడా తానే సాయం చేస్తున్నాడు సోనూసూద్. గతేడాది కాలంగా తనకు చేతనైంది సాయం చేస్తూ ప్రతి ఒక్కరికి కాదనకుండా సేవలు అందిస్తూనే ఉన్నాడు. ఈ విషయంలో దేశం మొత్తం సోనూసూద్ ను కొనియాడుతూనే ఉంది.సోనూసూద్ ఫౌండేషన్ ద్వారా ఎక్కడ ఎవరు సాయం అంటే ఆక్కడ సోనూ వాలంటీర్లు వాలిపోయి సాయం చేస్తూ వస్తున్నారు. సోనూ ఫౌండేషన్ ద్వారా కష్టం అన్నవారికి సాయం చేస్తున్నాడు ఈ రియల్ హీరో. అయితే ఈ సోనూ ఫౌండేషన్ కి పలువురు దాతలు విరాళాలు ఇస్తూ వస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ వరికుంటపాడుకి చెందిన అంధ యువతి బొడ్డు నాగలక్ష్మి సోనూ ఫౌండేషన్ కి 15వేలు విరాళంగా అందచేశారు. కరోనా కష్టకాలంలో నేనున్నాను అంటూ అందరికీ సాయం చేస్తూ మనుసుల్లో దేవుడు అనిపించుకుంటున్న సోనూ సూద్ ఈ విషయం చెప్పారు. దేశంలో అత్యంత ధనవంతు రాలు ఎవరైనా ఉన్నారు అంటే అది నెల్లూరుకు చెందిన అంధయువతి నాగలక్ష్మే అంటూ ట్వీట్ చేశారు. అంతే కాదు ఒకరి బాధను చూడటానికి కంటిచూపు అవసరం లేదని నాగలక్ష్మి నిరూపించారని ప్రశంసించారు. తను విరాళం ఇచ్చిన 15 వేలు నాగలక్ష్మి ఐదు నెలల పెన్షన్ కావటం విశేషం. లక్షలకు లక్షలకు జీతాలు తీసుకునే వారు.. భారీగా ఆదాయం ఉన్నవారు కూడా చేయలేని పని ఆమె చేసింది. సొంత వాళ్లు ఎలా పోతే తమకేంటి అనుకునే రోజుల్లో నాగలక్ష్మి పెద్ద మనసు చాటుకున్నారు.