సోనూసూద్.. కరోనా కాలంలో ఓ సూపర్ హీరో. సినిమాల్లో విలన్ రోల్స్ చేస్తూ.. పరిశ్రమలో తనకంటూ ఓ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. కరోనా కాలంలో ఎంతో మంది దేశ, విదేశాల్లో చిక్కుకుపోయిన ప్రజలను సొంత ఖర్చుతో స్వస్థలాలకు తరలించి మంచి మనసు చాటుకున్నాడు. కేవలం కరోనా కాలంలోనే కాక ఇప్పటికీ తన సాయం కోరి వచ్చిన వారికి లేదనకుండా సాయం చేస్తుంటాడు. దాంతో అతడిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుతున్నారు చాలా మంది యువత. ఈ క్రమంలోనే సోనూసూద్ చేసిన ఓ పని అతడిపై విమర్శలు వచ్చేలా చేసింది. అదే.. ముంబై లోకల్ ట్రైన్ లో అతడు ఫుట్ బోర్డ్ దగ్గర కూర్చుకుని ప్రయాణం చేయడం. ఆ వీడియో వైరల్ గా మారడంతో అతడిపై ముంబై రైల్వే ఆగ్రహం వ్యక్తం కూడా చేసింది.
సోనూసూద్.. భారతీయ చిత్ర పరిశ్రమకు పరిచయం అక్కర్లేని పేరు. తనదైన విలనిజంతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. అటు నటుడిగా బిజీగా ఉంటూనే.. తన సేవా దృక్ఫథాన్ని చాటుకుంటున్నాడు. కరోనా కష్ట సమయంలో ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సొంత ఖర్చులతో వారివారి ఇల్లకు చేర్చాడు సోనూసూద్. దాంతో అతడు ఇండియా యువతకు రోల్ మోడల్ గా మారాడు. అయితే కొన్ని రోజుల క్రితం డిసెంబర్ 13 న అతడు రైలులో ఫుట్ బోర్డ్ ప్రయాణం చేయడంతో ముంబై రైల్వే పోలీసులు అతడికి వార్నింగ్ ఇచ్చారు కూడా.
— sonu sood (@SonuSood) December 13, 2022
తాజాగా ఈ వీడియోపై స్పందించింది.. నార్తన్ రైల్వే.”సోనూ సర్ మీరు ఈ దేశంలో ఏంతో మందికి రోల్ మోడల్. మీ లాంటి వారు ఇలా ఫుట్ బోర్డ్ ప్రయాణం చేయడం బాధాకరం.. ప్రమాదకరం. ఈ తరహా వీడియో అభిమానులకు తప్పుడు సందేశాన్ని పంపుతుంది. భవిష్యత్ లో ఇలాంటి చేయకండి సోనూసూద్ సర్ జీ” అంటూ ట్విటర్ ద్వారా సందేశాన్ని పంపించింది. అయితే ఈ విమర్శలపై తాజాగా స్పందించాడు సోనూసూద్. “నన్ను క్షమించండి. రైలు డోరువద్దే మగ్గిపోతున్న కోట్ల పేదల జీవితాలు అర్ధం చేసుకునేందుకే అలా ప్రయాణించాను. ఇక దేశంలో రైల్వే వ్యవస్థను మెరుగుపరిచినందుకు ధన్యవాదాలు” అంటూ తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చాడు సోనూసూద్.
क्षमा प्रार्थी 🙏
बस यूँ ही बैठ गया था देखने,
कैसा महसूस करते होंगे वो लाखों ग़रीब जिनकी ज़िंदगी अभी भी ट्रेन के दरवाज़ों पे गुज़रती है।
धन्यवाद इस संदेश के लिए और देश की रेल व्यवस्था बेहतर करने के लिए। ❤️🙏 https://t.co/F4a4vKKhFy— sonu sood (@SonuSood) January 5, 2023