తెలంగాణ భవన్‌లో విలీన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీఆర్ఎస్పిపి నేత డాక్టర్ కె .కేశవ రావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17 తెలంగాణ విలీన దినమేనని చెప్పారు. ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్ర్యం రాలేదని… ఈరోజే (సెప్టెంబర్ 17) మనకు సంపూర్ణ స్వాతంత్ర్య దినోత్సవమని చెప్పారు.
ఇవాళ మనకు సంపూర్ణ స్వాతంత్ర్య దినోత్సవమని చెప్పారు. 1947, ఆగస్టు 15న మనకు స్వాతంత్య్రం సిద్ధించలేదని, ఏడాది తర్వాత తెలంగాణకు స్వేచ్ఛ లభించిందన్నారు. అందువల్ల ఇవాళ మన స్వాతంత్య్రం సంపూర్ణమయిందని చెప్పారు. కొంతమంది కావాలనే దీనిపై విమర్శలు చేయడం.. విభేదాలు సృష్టించడం లాంటివి చేస్తున్నారని ఆన్నారు. అయితే భారత్ లో మనం కూడా విలీనం కావాలని కోరుకున్నామని… ఈ అంశంపై కొందరు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు.
ఇదిలా ఉంటే.. తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ విలీన దినోత్సవాన్ని నిర్వహించగా… పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ విమోచన దినోత్సవాన్ని జరుపుకుంది. సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినం జరుపుకుంటున్న సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజ. స్వాతంత్ర్య పోరాటంలో అత్యున్నత త్యాగాలు చేసిన అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించాలని తాను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.
సెప్టెంబర్ 17 న హైదరాబాద్ విమోచన దినం జరుపుకుంటున్న సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
స్వాతంత్య్ర పోరాటంలో అత్యున్నత త్యాగాలు చేసిన అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.#Vimochanadinam
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) September 17, 2021
ఇక జనసేన అధినేత పవన్ కళ్యాన్ నేడు తెలంగాణ విమోచన దినం శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ విమోచన యోధులకు వందనం.. భూమి కోసం.. భుక్తి కోసం.. విముక్తి కోసం అంటూ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
*తెలంగాణ విమోచన యోధులకు వందనం*
భూమి కోసం.. భుక్తి కోసం.. విముక్తి కోసం pic.twitter.com/lbIxhnZfkf
— Pawan Kalyan (@PawanKalyan) September 17, 2021