సోనూసూద్.. ఇప్పుడు ఈ పేరు చెప్తే నిలువెత్తు మానవత్వం గుర్తుకి వస్తోంది. ప్రజలను కష్టాల నుండి కాపాడటానికి భూమికి దిగి వచ్చిన దేవుడిలా సోనూని చూస్తున్నారు ప్రజలు. దీనికి తగ్గట్టే సోనూసూద్ కూడా తన శక్తి వంచన లేకుండా ప్రజలకు సేవ చేస్తున్నాడు. దేశంలో ఏ మూల ఎవరికి కష్టం వచ్చినా.., సోనూసూద్నే తలుచుకుంటున్నారు. వారికి సోను నుండి సహాయం కూడా ఇంతే ఫాస్ట్ గా అందుతోంది. ఇందుకే జిల్లా కలెక్టర్లు సైతం తక్షణ సహాయం కోసం సోనూసూద్ నే ఆశ్రయిస్తున్నారు. అయితే.., ఇంత కార్యక్రమం సోనూసూద్ ఒక్కడి వల్లే సాధ్యం కాదు కదా..? ఇందుకోసం ఆయన ఒక ఫౌండేషన్ ని స్థాపించారు. ప్రజలకి సేవ చేయాలనుకున్న ఎవరైనా ఈ ఫౌండేషన్ లో జాయిన్ కావచ్చు. ఒక్క రూపాయి విరాళం ఇవ్వలేని వారు కూడా జాయిన్ కావచ్చు. అవసరమైనప్పుడు సోను టీమ్ వారిని సంప్రదించి.. ఆయా ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు వారి చేతుల మీదే జరిపిస్తోంది. ఇక ఇదే సమయంలో సోనూసూద్ ఫౌండేషన్ కి వందల కోట్ల విరాళాలు అందుతున్నాయి. ఇవన్నీ కూడా మానవతావాదులు సోనూసూద్ మీద నమ్మకంతో ఆయన ఫౌండేషన్ కి చేరవేస్తున్నవే. కానీ.., ఇప్పుడు ఈ విరాళాలలో 100 కోట్ల మోసం జరిగిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
సోనూసూద్ పేరుతో పాటు ఆయన ఫొటో పెట్టుకొని ఓ ఫేక్ ఫౌండేషన్స్ విరాళాలు సేకరిస్తూ వచ్చింది. ఇందుకోసం ఎవ్వరికీ అనుమానం రాకుండా ఓ పోస్టర్ రూపొందించిన కొంత మంది కేటుగాళ్లు. ఆ పోస్టర్ లో సూనుని పొగుడుతూ.., ఆయన చేస్తున్న మంచి పనిలో భాగ్యస్వామ్యులు అవ్వండి. సోనూసూద్ ఫౌండేషన్ కి విరాళాలు ఇచ్చి మానవత్వాన్ని చాటుకోండి అంటూ ప్రచారానికి తెర లేపారు. ఇంతే కాదు.., ఇలా ఇచ్చే ఈ విరాళాల విషయంలో మీకేమైనా అనుమానాలు ఉంటే ఈ నెంబర్స్ కి ఫోన్ చేసి మాట్లాడవచ్చు అంటూ కొన్ని ఫోన్ నెంబర్స్ ని కూడా ఉంచారు. దీంతో.. వీరిని నమ్మిన ప్రజలు భారీ ఎత్తున నకిలీ గాళ్ళకి డొనేషన్స్ పంపించారు. కానీ.., ఈ విషయం సోనూసూద్ టీమ్ కి ఆలస్యంగా తెలిసింది. దీనితో సోనూసూద్ వెంటనే స్పందించాడు. ఇలాంటి వారిని నమ్మకండి. వీరి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. మా ఫౌండేషన్ విరాళాల కోసం ఎలాంటి ప్రచార కార్యక్రమాలు చేయదు. ఈ విషయాన్ని దేశ ప్రజలు గుర్తు పెట్టుకోవాలని సోనూ కోరాడు. అలాగే.. నాకు, ఆ ఫౌండేషన్కు ఎలాంటి సంబంధం లేదంటూ సోనూ స్పష్టం చేశారు. ఆ సంస్థ గురించి తెలిస్తే వెంటనే దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాల్సిందిగా కోరారు సోనుసూద్. సోను.. పేరు చెప్తే ఈజీగా విరాళాలు వస్తుండటంతో చాలా మంది నకిలీ గాళ్ళు ఇదే పనిలో ఉన్నారని.., ఇలా ఇప్పటికే మొత్తం రూ.200 కోట్ల నకిలీ గాళ్ళు కొట్టేసినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. మరి రానున్న కాలంలో సోనూసూద్ ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడో చూడాలి.