విశాఖపట్నం- సమాజంలో రోజు రోజుకు మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. మనుషుల కంటే డబ్బుకు, ఆస్తులకే ఎక్కువ విలువనిస్తున్నారు చాలా మంది. ఆఖరికి కన్న తల్లిదండ్రులను కూడా ఆదరించడం లేదు సరికదా ఆస్తుల కోసం హత్య కూడా చేసే దుర్మార్గానికి పాల్పడుతున్నారు. విశాఖపట్నంలో ఇలాంటి దారుణ ఘటనే చోటుచేసేకుంది. ఆస్తి కోసం కన్నవాల్లనే హత్య చేశాడో దుర్మార్గుడు.
విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం టెక్కలిపల్లిలో ఈ దారుణం జరిగింది. ఈ గ్రామంలో 84ఏళ్ల స్వామి నాయుడు తన భార్య నర్సమ్మతో కలిసి ఉంటున్నాడు. స్మావి నాయుడుకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు అప్పారావు రైల్వే కలాసీగా పనిచేస్తుండగా, చిన్న కొడుకు సత్యనారాయణ ఆర్టీసీలో పనిచేస్తున్నాడు. ఇద్దరు కొడుకులకు పెళ్లిళ్లు చేసి, ఉన్న ఆస్తిని చెరిసగం పంచి ఇచ్చాడు స్వామి నాయుడు. 30 సెంట్ల భూమిని మాత్రం తన పేరుపైన ఉంచుకున్నాడు.
ఇక పెద్ద కొడుకు అప్పా రావు తమను సరిగ్గా చూసుకోవడం లేదని, చిన్న కొడుకు సత్యనారాయణ దగ్గర ఉంటున్నారు స్వామి నాయుడు దంపతులు. ఐతే స్మామి నాయుడు పేరుపై ఉన్న 30 సెంట్ల భూమిపై ఎప్పటి నుంచో పెద్ద కొడుకు అప్పా రావు కన్ను ఉంది. ఆ భూమి కూడా తనక ఇవ్వాలని చాలా రోజులుగా తల్లిదండ్రులను వేధిస్తూ వస్తున్నాడు. ఐతే తండ్రి మాత్రం ఆ భూమిని మాత్రం ఇవ్వనని చెప్పడంతో వారిపై పగ పెంచుకున్నాడు.
ఈ క్రమంలో తల్లిదండ్రుల పేరుపై ఉన్న 30 సెట్ల భూమిని దున్ని నాట్లు వేసేందుకు పెద్ద కొడుకు కూలీలను పురమాయించాడు. ఈ విషయం తెలుసుకున్న స్వామి నాయుడు, నర్సమ్మలు పొలం దగ్గరకు వెళ్లారు. అక్కడ తన పొలంలో నాట్లు వేయడానికి వీళ్లేదని తండ్రి చెప్పడంతో ఆగ్రహం ఊగిపోయిన కొడుకు అప్పా రావు తండ్రిపై కత్తితో దాడి చేశాడు. తల్లి నర్సమ్మను పొలంలో తొక్కి చంపేశాడు. ఈ ఘోరానికి అతని భార్య కూడా సహకరించింది. విషయం ఉళ్లోవాళ్లకి తెలిడయంతో వాళ్లు పారిపోయారు. ఆస్తి కోసం కన్న వాళ్లనే కసాయివాడిలా కొడుకు హత్య చేయడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.